Asianet News TeluguAsianet News Telugu

రంజాన్ 2023: ఈ పవిత్ర మాసంలో ఉపవాసం ఉండేవారు ఈ రూల్స్ ని ఖచ్చితంగా పాటించాలి.. లేదంటే?

Ramadan 2023: రంజాన్ నెలంతా ముస్లింలు ఉపవాసం ఉంటారు. ఈ నెలంతా సూర్యోదయానికి ముందే భోజనం చేసి రోజంతా ఉపవాసం ఉంటారు. 
 

 Ramadan 2023: Fasting Rules for Ramadan
Author
First Published Mar 23, 2023, 10:34 AM IST

Ramadan 2023: రంజాన్ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు. ఈ నెలంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్ మాసం ఇస్లామిక్ క్యాలెండర్ తొమ్మిదో నెల మార్చి 22న ప్రారంభమై ఏప్రిల్ 21న ముగుస్తుంది. ఈ కాలంలో ముస్లింలు సూర్యోదయానికి ముందే భోజనం చేసి రోజంతా ఉపవాసం ఉంటారు. ఈ పండుగ ఈద్-ఉల్-ఫితర్ తో రంజాన్ పండుగ ముగుస్తుంది. ఈ పండుగను ముస్లింలు తమ ఆత్మీయులతో కలిసి ఈ రోజును జరుపుకుంటారు.

ఈ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి వంట చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానాలు చేస్తారు. అయితే షవ్వాల్ లో ముస్లింలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజున బిర్యానీ వంటి రుచికరమైన భోజనాన్ని ఆరగిస్తారు. 

ఉపవాస నియమాలు

  • పవిత్ర రంజాన్ మాసం అంతటా.. ఎన్నో జాతులకు చెందిన ముస్లింలు ఉపవాసం ఉంటారు.
  • ఉపవాస నియమాల ప్రకారం.. ఉపవాసం ఉన్న వ్యక్తులు సూర్యుడు ఉదయించడానికి, అస్తమించడానికి ముందు, తర్వాత మాత్రమే తినాలి. తాగాలి. 
  • పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అన్ని సుఖాలకు దూరంగా ఉండాలని ఆధ్యాత్మిక అంశాలు సూచిస్తున్నాయి.
  • ప్రార్థన, ఆత్మ ప్రక్షాళన, ఆధ్యాత్మికత, కరుణపై మాత్రమే తమ ఆలోచనలను కేంద్రీకరించాలి.
  • గర్భిణులు లేదా పాలిచ్చే మహిళలు, అలాగే శారీరకంగా లేదా మానసికంగా అనారోగ్యంతో ఉన్నవారు ఈ రంజాన్ లో ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. 
  • యుక్తవయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులను ఉపవాసం ఉండాలని బలవంతం చేయకూడదు. 
  • సూర్యోదయానికి ముందు తినే భోజనాన్ని సుహుర్ అని, సూర్యాస్తమయం తర్వాత తినే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు.
  • ముహమ్మద్ ఆచారాన్ని గౌరవించడానికి ప్రజలు సాంప్రదాయకంగా ఖర్జూరాలతో ఉపవాసాన్ని విరమిస్తారు. 
Follow Us:
Download App:
  • android
  • ios