Asianet News TeluguAsianet News Telugu

వయసుని తగ్గించే జ్యూస్ ఇది..

ప్రకృతి నుంచి లభించే సహజ సిద్ధమైన  పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటే శరీరానికి ఆరోగ్యమే కాదు, మీ గ్లామర్ కూడా రెట్టింపు అవుతుంది.
 

pomegranate juice is used for anti agening
Author
Hyderabad, First Published Nov 21, 2018, 2:33 PM IST

అందంగా ఉండాలని, వయసు తక్కువగా కనిపించాలని కోరుకోని వారి  సంఖ్య చాలా అరుదు అనే చెప్పవచ్చు. వయసు తక్కువగా కనిపించాలని చాలా మంది మార్కెట్లో లభించే ఏవే క్రీములు ముఖాలకు పూస్తూ ఉంటారు. కానీ వాటి ప్రతిఫలం మాత్రం శూన్యంగానే ఉటుంది.

ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం కందిపోవడం, ర్యాషెస్ రావడం, పగిలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. అంతేకాదు జలుబు, తుమ్ములు పట్టి పీడిస్తూ ఉంటాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలంటే ప్రకృతి నుంచి లభించే సహజ సిద్ధమైన  పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటే శరీరానికి ఆరోగ్యమే కాదు, మీ గ్లామర్ కూడా రెట్టింపు అవుతుంది.

ఏ సీజన్‌లో అయినా దొరికే పండు దానిమ్మ పండు. దానిమ్మ చెట్టులోని ప్రతి భాగం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. దానిమ్మ పండు రసాన్ని రోజూ తీసుకుంటే ఎన్నో వ్యాధులు దరిచేరవు. శరీరంలో వేడి నియంత్రణ అవుతుంది. గ్లామర్ విషయానికొస్తే ఇది మంచి యాంటీ ఏజ్‌నింగ్‌గా పనిచేస్తుంది. అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.  కిడ్నీలకు, గుండెకు ఎంతో మంచిది ఈ జ్యూస్. అంతేకాదు మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా దానిమ్మ పండ్ల రసాన్ని తీసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios