Asianet News TeluguAsianet News Telugu

muharram 2022: ఇస్లామిక్ న్యూయర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

muharram 2022: ఇస్లామిక్ క్యాలెండర్ లో 12 నెలలు ఉన్నప్పటికీ.. అందులో మొహర్రం మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది.
 

Muharram 2022: All we need to know about the Islamic New Year
Author
Hyderabad, First Published Aug 2, 2022, 3:07 PM IST


muharram 2022: ఇస్లామీయ క్యాలెండర్ మొదటి మాసం మొహర్రం. కర్బలా యుద్ధంలో హజ్రత్ అలీ కుమారుడు, ముహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ అమరుడయ్యాడు. ఇస్లామిక్ క్యాలెండర్ లో 12 నెలలు ఉన్నప్పటికీ.. మొహర్రం మాసం ముస్లింలకు మతపరంగా ఎంతో పవిత్రమైనది. క్రీ.శ 622 లో మొదటి ఇస్లామిక్ రాజ్యం స్థాపనకు గుర్తుంగా ఈ నెల గుర్తింపు పొందింది. భారతదేశంలో మొహర్రం నెల జూలై 31, 2022 న ప్రారంభమయ్యింది.

చరిత్ర

మొహర్రం మాసంలో జరిగిన ముఖ్యమైన ఘటనలలో కర్బలా యుద్ధం ఒకటి. ఇమామ్ హుస్సేన్ కు ఉమయ్యద్ ఖలీఫా మొదటి యాజిద్ పంపిన సైన్యానికి మధ్య యుద్దం జరిగింది. ఈ యుద్దం క్రీ.శ 690 లో జరిగింది. ఈ యుద్దంలో ఇమామ్ హుస్సేన్ అమరుడయ్యాడు. ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలు సంతాపం తెలుపుతారు. మొహర్రం నెల మొదటి 10 రోజులు అషూరాతో ముగుస్తుంది. అంతేకాదు కొందరు ఇమామ్ హుస్సేన్ అనుభవించిన బాధలను పునఃసృష్టి చేయడానికి Self-flagellation లో పాల్గొంటారు. 

ఏదేమైనా సున్నీ ముస్లింలు ప్రార్థనలు, ఉపవాసం చేస్తూ మొహర్రాన్ని జరుపుకుంటారు. అషూర అంటే ఇస్లామిక్ సంవత్సరం మొదటి నెల 10 వ రోజు అని అర్థం. 14 శతాబ్దాల క్రితం మొహర్రం 10వ రోజున జరిగిన కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ ను క్రూర పాలకుడు నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ హత్యకు గురైనప్పటికీ..  సమానత్వం, న్యాయం, దయ వంటి అతని సందేశాలతో నేటికీ ప్రజల మధ్యన అతను జీవిస్తున్నాడని నమ్ముతారు. 

కర్బలా లేదా కెర్బాలా అనేది బాగ్దాద్ కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ ఇరాక్ లోని ఒక నగరం. ఇది కర్బలా గవర్నరేట్ రాజధాని. అంతేకాదు ఈ నగరంలో 700,000 మంది జనాభాను  కలిగి ఉందని అంచనా వేయబడింది (2015 వరకు అధికారిక సమాచారం ప్రకారం). ఇమామ్ హుస్సేన్ మందిరం అక్కడ ఉంది. ఇది ముస్లింలకు పవిత్ర నగరంగా కొనసాగుతోంది. 

ది హిజ్రా

ఇది ముహమ్మద్ ప్రవక్త తన సహచరులతో మక్కా నుంచి మదీనాకు చేసిన ప్రయాణాన్ని సూచిస్తుంది. అలాగే క్రీ.శ 622 లో క్యాలెండర్ ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios