Asianet News TeluguAsianet News Telugu

Crying: పురుషులూ.. మీరు ఆ పని చేస్తే తప్పేంలేదు తెలుసా..

Crying: మగాడంటే ఎట్లుండాలిరా.. గంభీరంగా ఉండాలి. ఏడుపనేది వీళ్లకు తెలియకూడదు.. అసలు మగాడంటేనే ఏడవకూడదురా. అది కేవలం ఆడవారికోసమే పుట్టిందని తెగ గప్పాలు కొడుతుంటారు చాలా మంది. ఏవరైనా ఏడిస్తే ఆడదానిలా అలా ఏడుస్తావేంటిరా అని ఎగతాలి చేస్తుంటారు. నిజానికి మగవారు ఏడిస్తే ఏమౌతుందో తెలుసా..

men should cry michigan university scientistssurvey
Author
Hyderabad, First Published Jan 25, 2022, 11:50 AM IST

Crying: మగాడు సింహం లాంటోడు. ఎల్లప్పుడు గంభీరంగా ఉండాలి. ఎంత బాధొచ్చిన్నా ఏడకూడదు. ఏడుపు మగవారి నైజం కాదు. అసలు ఏడుపు పుట్టింది కేవలం ఆడవారికోసమే నంటూ కొంత మంది మంది ప్రగల్బాలు పలుకుతుంటారు. అసలు ఈ సమాజంలో మగవారికి స్వతంత్ర్యంగా ఏడిచే హక్కు కూడా లేదు. దీనికంతటికి కారణం ఈ సమాజమే. అవును సమాజమే ఈ ఆచారాన్ని పెంచి పోషించుకుంటూ వస్తోంది. తనివి తీరేలా.. బాధంతా పటాపంచలై పోయేలా బిగ్గరగా ఏడవాలని లోలోపలున్నా.. ఏడిస్తే ఈ సమాజం నన్ను ఎక్కడ చిన్న చూపు చూస్తుందోనని తనకున్న బాధనంతా అణచుకుంటున్నారు మగవారు. ఎవరైనా బాధపట్టలేక ఏడిస్తే అదేంటిరా ఆడదానిలా అలా ఏడుస్తున్నావు అంటూ దెబ్బిపొడుస్తారు. పరిస్థితి ఎంతకఠినమైనదైనా సరే ఏడుపు రాకూడదు. నువ్వు సింహం, పులి అంటూ పొగడ్తలతో మగవారిని బాధనుంచి బయటపడకుండా చేస్తోంది ఈ సమాజం. కానీ మగవారికి కూడా ఏడుపు ఎంతో ముఖ్యమని.. వీరు కూడా ఖచ్చితంగా ఏడ్చి తీరాలని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.  లింగ భేదంతో సంబంధం లేకుండా బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడిస్తేనే ఆ బాధనుంచి విముక్తి పొంది మనుసు ప్రశాంతంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మనసులో ఉన్న బాధను తొలగించుకోవడానికి ఏడవడానికి మగ అయితే ఏంటి.. ఆడ అయితే ఏంటి.. మనసు బాధతో మూలుగుతుంటే  దానినుంచి బయటపడటానికి మగాడు కూడా ఖచ్చితంగా ఏడవాల్సిందే. ఏడుపు ఆడవారి సొంతం అని రూలేమీ లేదు కదా. మగవారు ఏడిస్తే తప్పు.. దీనికి శిక్ష ఉంటుందని ఎక్కడా లేదు. నో నేను మగాడిని అలా ఏడవకూడదంటే మనసులోని బాధ తీరక మనసిక మనోవేధనకు గురై అనేక శరీరక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందులోనూ అది ప్రాణాంతకం కూడా కావొచ్చు. మిచిగాన్ యూనివర్సిటీ సైంటిస్టుల ప్రకారం.. ఒక వ్యక్తి తనకున్న బాధను కన్నీల రూపంలో వదిలేయకుంటే తనకు తానే కీడు చేసుకున్నవాడు అవుతాడని పేర్కొంటున్నారు. అందులోనూ మనసులోని బాధను కన్నీళ్ల రూపంలో వదిలేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా బాధను దిగమింగి అలాగే మనసులో దాచుకుంటే స్ట్రెస్ కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందట. అంతేకాదు.. తమకున్న బాధలను ఇతరులతో ఎవరైతే పంచుకోరో వారు జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారని కొత్త అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ అధ్యయనంలో సుమారుగా 5500 మగవారిపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు.

నవ్వు వల్ల ఎన్ని ఉపయోగాలు జరుగుతాయో.. ఏడుపు వల్ల కూడా అన్నే ప్రయోజనాలున్నాయని తేల్చి చెప్పారు. మనలో ఉన్న భావాల ప్రకారం eye sockets లో కన్నీరు రిలీజ్ అవుతుందట. వాటిని బయటకు రాకుండా చేస్తే మెదడు పనితీరు నెమ్మదిస్తుందట. ఈ సమస్య ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తుందట. దీని కారణంగా చాలా మంది మగవారు ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఎవరినీ పట్టించుకోకుండా మీలో ఉన్న బాధంతా బయటికి పోయేలా కన్నీళ్లకు స్వేచ్ఛనీయండి. 

Follow Us:
Download App:
  • android
  • ios