రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయంటే డయాబెటిస్ వచ్చిందని అర్థం. డయాబెటిస్ రాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. దీనికోసం ఏం చేయాలో తెలుసుకోండి.
డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని సహజంగానే తగ్గించుకోవాలి. లేకుంటే అది తీవ్రమైన డయాబెటిస్ సమస్యగా మారిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే అంశాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి పనులు చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా డయాబెటిస్ ను సహజంగానే అదుపులో ఉంచుకోవచ్చో తెలుసుకోండి.
ఇవి తినండి ఇవి వద్దు
రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్టు అనిపిస్తే మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఆహారాలను అధికంగా తినండి. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు. ఈ ఫైబర్ గ్లూకోజ్ శోషణను అనుమతించేలా చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లను వినియోగాన్ని కూడా తగ్గించాలి. వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, కూల్డ్రింకులు, పంచదార కలిపిన పానీయాలు, పంచదారతో చేసిన పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే బంగాళదుంపలు, బియ్యం వంటివన్నీ ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇక లీన్ ప్రోటీన్ ఉండే చికెన్, చేపలు, టోఫు వంటివి అధికంగా తినాల్సిన అవసరం ఉంది. ఇక భోజన సమయాలను కూడా స్థిరమైన స్థిరంగా ఉంచుకోవాలి. నచ్చిన సమయంలో తినకుండా ప్రతిరోజు ఒకే సమయానికి భోజనాన్ని తినాల్సిన అవసరం ఉంది.
శారీరక శ్రమ
ప్రతిరోజూ ఎంతో కొంత వ్యాయామం చేయాలి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి శరీరం గ్లూకోజ్ ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేయడానికి వ్యాయామం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు అరగంట పాటు వేగంగా నడవడం లేదా యోగా చేయడం కాసేపు ఈత కొట్టడం వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే కూర్చునే సమయాన్ని తగ్గించండి. ఎక్కువసేపు మీరు కూర్చున్నారంటే శరీరం బరువు పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంది.
అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. నిద్రకు ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ సమయం నిద్రపోవాలి. ప్రతిరోజు రాత్రి 7 గంటల సమయానికి తగ్గకుండా నిద్రపోతే ఉత్తమం. ఇక ఆల్కహాల్, కెఫీన్ ఉండే ఆహారాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.
చక్కెర స్థాయిలను తగ్గించడానికి మరొక ఉత్తమమైన పద్ధతి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం. అంటే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. ఎప్పటికప్పుడు వైద్యులను కలిసి డయాబెటిస్ ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలి. కొబ్బరి ఉండే పదార్థాలను పూర్తిగా మానేయాలి.
