Maha Shivaratri: పండుగలు వినోధం కోసమో లేకపోతే విశ్రాంతి కోసమో ఉద్ధేశించబడలేదు. ప్రతి పండుగలోనూ ఆథ్యాత్మికత ఉంటుంది. దైవికతతో కూడుకుని ఉంటుంది. మనం జరుపుకునే ప్రతి పండుగలో ఎన్నో ఆరోగ్య,  వైజ్ఞానిక, శాస్త్రీయ కారణాలతో కూడుకున్నవి. ఇక ఈ శివరాత్రి కూడా అంతే. శివరాత్రి రోజున ఎన్నో అద్బుతాలు జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.  

Maha Shivaratri: ఎంతో పవిత్రమైన శివరాత్రి మరికొన్ని రోజుల్లో రానుంది. ఈ మహా శివరాత్రి పరమేశ్వరుడి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున శివుడి భక్తులంతా ఉపవాసాలు, పూజలు, అభిషేకాలు, జాగరణలతో ఆ ఈశ్వరుడి సన్నిధిలోనే గడుపుతుంటారు. అయితే మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక శాస్త్రీయ, ఆరోగ్య కారణాలున్నాయట. ఆకాశం నుంచి ప్రసరించే విద్యుత్ తరంగాలు, కాస్మిక్ కిరణాలను దృష్టిలో పెట్టుకుని.. ఆయా రోజుల్లో ఎలాంటి పనులు చేస్తే మంచిదో పురాణాలు పేర్కొంటున్నాయి. 

ఇక ఈ శివరాత్రి రోజున అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు మానవ వికాసానికి, పరిపూర్ణతను సాధించడానికి ఎంతో సహాయపడతాయట. అందుకోసమే మహాశివరాత్రి నాడు కొన్ని నియమనిబందలు ఉంటాయి. వాటిని పరిపూర్ణంగా ఆచరించినప్పుడే మనకు పుణ్య ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతున్నారు.

ఉపవాసం: మహా శివరాత్రి నాడు ఖచ్చితంగా ఉపవాసం చేయాలని, చేస్తే పుణ్యం వస్తుందని శాస్త్రం పేర్కొంటోంది. కానీ అనారోగ్యంతో ఉన్నవాళ్లు, చిన్న పిల్లలు, ముసలి వాళ్లు , గర్భవతులు ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతోంది. వీళ్లకు మినహాయింపు ఉంది. 

ఉపవాసం చేయాలనుకునే వారు ఉపవాసానికి ముందు రోజు తర్వాతి రోజు మాంసాహారాలను తీసుకోకూడదు. అలాగే ఆల్కహాల్ ను కూడా తాగూడదు. అయితే ఉపవాసం చేస్తే ఆకలి అవుతుందని.. ఆరోజు లేట్ గా లేసే వారు చాలా మందే ఉన్నారు. అట్ల అస్సలు చేయకూడదు. 

ఉపవాసం చేసే వారు మహా శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని శాస్త్రం చెబుతోంది. అలాగే శివుడికి అభిషేకాలు చేసి పూజించాలి. ఉపవాసం అంటే అర్థం దేవుడికి దగ్గరగా ఉండటమని అర్థం. మన ఇంద్రియాలను, మనస్సును దైవచింతనలో ఉంచడమని అర్థం. ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో ఉండే ఎన్నో విషపదార్థాలు బయటకు పంపబడతాయి. అంతేకాదు ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది. 

ఉపవాసం చేసే వాళ్లు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదని కొందరు చెబుతుంటారు. అలా అని ఎకకడా పేర్కొనబడలేదు. అలా అస్సలు చేయొద్దు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపట్టి దేవుడిని పూజించడం కష్టతరమైంది. 

మహా శివరాత్రి రోజున మీరు మీకు వీలైనంత బియ్యం, ఇతర ఆహారాలను పేదవారికి ఇవ్వాలట. ఎందుకంటే ఈ భూలోకంలో శివుడు అష్టమూర్తి తత్వంలో మనిషి రూపంలో సంచరిస్తాడని పురాణాలు చెబుతన్నాయి. ఆకలితో ఉన్న పేదవారి ఆకలి తీర్చడం ఈశ్వర సేవే అవుతుంది. అందుకే ఆ రోజున పేదవారికి ఖచ్చితంగా దానం చేయాలి. 

శివరాత్రి రోజు మౌనవ్రతం చేస్తే ఎన్నో అద్బుత ఫలితాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ రోజున మౌన వ్రతం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మౌనవ్రతం చేయడమంటే కేవలం మాట్లాడకుండా ఉండటమే అనుకుంటే పొరపాటే. మౌనవ్రతం చేస్తున్నప్పుడు మనోవాక్కాయములు ఏకమైనప్పుడే దానికి తగ్గ ఫలం అందుతుంది. మౌనవ్రతం చేస్తున్నప్పుడు మన ఆలోచనలు కేవలం శివుడిపైనే ఉండాలి. అవసరమైతే ఇంట్లో కాకుండా శివాలయాలకు వెళ్లి చేస్తే మీ మనస్సు దేవుడిపై ఉంటుంది. ప్రశాంతంగా కళ్లు మూసుకుని ఆ శివుడిపై మనస్సును కేంద్రీకరించండి.