Asianet News TeluguAsianet News Telugu

మేజిక్ రైస్: ఈ బియ్యాన్ని వండక్కర్లేదు.. నానబెడితే చాలు.. అన్నం రెడీ

అన్నం వండలంటే మనం ఏం చేస్తాం.. బియ్యాన్ని కడిగి.. గ్యాస్‌ స్టవ్ మీదనో.. కుక్కర్ మీదో ఉంచి.. 20 నిమిషాలు వెయిట్ చేస్తే కానీ.. అన్నం తినలేము కదా.. అయితే అన్నం కేవలం నానబెడితే చాలు అన్నంలా తయారయ్యే బియ్యం గురించి తెలుసా

magic rice
Author
Assam, First Published Aug 10, 2018, 3:22 PM IST

అన్నం వండలంటే మనం ఏం చేస్తాం.. బియ్యాన్ని కడిగి.. గ్యాస్‌ స్టవ్ మీదనో.. కుక్కర్ మీదో ఉంచి.. 20 నిమిషాలు వెయిట్ చేస్తే కానీ.. అన్నం తినలేము కదా.. అయితే అన్నం కేవలం నానబెడితే చాలు అన్నంలా తయారయ్యే బియ్యం గురించి తెలుసా.. అసోం రాష్ట్రంలోని నల్బరీ, బార్పెటా, గోల్‌పరా, కామ్‌రూప్, ధుబ్రీ, చిరాంగ్, దరంగ్ తదితర ప్రాంతాల్లో పండించచే ‘‘బొకా ఛాల్‌’’ బియ్యాన్ని నానబెట్టడం ద్వారా అన్నంలా మార్చవచ్చు.

మొఘలుల కాలంలో సైన్యం కోసం పండించిన ఈ బియ్యాన్ని.. తర్వాతి కాలంలో సాధారణ ప్రజలు తినడం ప్రారంభించారు. ఈ బియ్యాన్ని గంటపాటు చల్లటి నీటిలో నానబెట్టి.. ఓ 20 నిమిషాల తర్వాత చూస్తే అది ఉబ్బెత్తుగా మారి చూడటానికి సాధారణ అన్నంలాగే ఉంటుంది. అసోం రాష్ట్రంలో కొన్ని పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంటికి వచ్చిన అతిథుల కోసం ఈ బియ్యాన్ని వండిపెడతారు.

అయితే రైతులు ఈ బియ్యాన్ని కేవలం తమ కోసమే పండించుకుంటున్నారు. బయటి వ్యక్తులకు అంతగా తెలియకపోవడం వల్ల మార్కెట్ పరంగా సరైన లాభాలు రావని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ బియ్యం ప్రత్యేకత తెలుసుకున్న భారత ప్రభుత్వం వీటికి భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. అలాగే కేవలం నాన బెట్టడం ద్వారా అన్నంగా మారే ఈ బియ్యం ప్రత్యేకత ఏంటో తెలుసుకోవడానికి రెండు స్వచ్ఛంద సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios