ఈ మధ్యకాలంలో డయాబెటిస్ తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే.. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాసిస్ ని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఇటీవల జరిగిన ఓ తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు.. రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఇలా క్రమం తప్పకుండా క్యారెట్ జ్యూస్ తీసుకుంటే.. డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుందంటుని కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చెబుతున్నారు.

క్యారెట్లలో కెరోటిన్ ఉంటుంది. ఆ కెరోటిన్ ను మానవ శరీరం విటమిన్ ఏ గా మార్చుకుంటుంది. ఈ విటమిన్ ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. అందు వల్ల క్యారెట్ ని తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్ లో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి షుగర్ ని పెంచవని చెప్పారు. రోజూ పరగడుపున గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగాలని సూచిస్తున్నారు.