Asianet News TeluguAsianet News Telugu

ఆషాడంలో సందేహలు: గోరింటాకు ఎందుకు..? పెళ్లిళ్లు ఎందుకు చేయరు..?

ఆషాఢ మాసం వచ్చేసింది... ఈ మాసం వస్తుందంటే చాలు కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు తమ భర్తలను వదిలి వెళ్లాలంటే తెగ బాధపడిపోతారు. శుభకార్యాలను చేయాలనుకునేవారు అబ్బా నెల రోజులు ఆగాల్సిందేనా అంటూ నిట్టూరుస్తారు..?

importance of ashada masam

ఆషాఢ మాసం వచ్చేసింది... ఈ మాసం వస్తుందంటే చాలు కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు తమ భర్తలను వదిలి వెళ్లాలంటే తెగ బాధపడిపోతారు. శుభకార్యాలను చేయాలనుకునేవారు అబ్బా నెల రోజులు ఆగాల్సిందేనా అంటూ నిట్టూరుస్తారు..? ఈ మాసంపై వచ్చినన్ని సందేహాలు మరే ఇతర మాసంపైనా రావంటే అతిశయోక్తి కాదు..ఆషాడ మాసం పవిత్రమైనది కాదా ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు చేస్తే ఏమవుతుంది ? ఆషాడ మాసంలో అనేక పూజలు, వ్రతాలు నిర్వహించడానికి మంచిదైనప్పుడు, పెళ్లిళ్లు చేయడానికి ఎందుకు మంచిది కాదు ? ఇలా ఎన్నో సందేహాలు. 

సూర్యభగవానుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు... అప్పటి నుంచే దక్షిణాయాన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. 

పెళ్లిళ్లు ఎందుకు చేయరంటే: ఎన్నో పర్వదినాలు, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడే ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణాలు చాలు ఉన్నాయి..

* పూజలు, హోమాలు ఇతర క్రతువులతో వేద పండితులు క్షణం తీరిక లేకుండా ఉంటారు.. ఈ సమయంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలు దొరకదు..

* ఈ మాసంలో దేవదేవుడైన శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు.. ఈ సమయంలో పెళ్లిళ్లు చేస్తే.. భగవంతుడి ఆశీర్వాదాలు అందవనే నమ్మకంతోనే పూర్వీకులు పెళ్లిళ్లు చేయడం నిషేధించారట.

* దక్షిణ భారతదేశంలో ఆషాఢ మాసంలో వ్యవసాయదారులకు ఎలాంటి  పనులు ఉండవు.. అందువల్ల ఆ సమయంలో డబ్బు చేతిలో ఉండదు.. ఈ కారణం చేత పెళ్లిళ్లు చేయరని ఓ నమ్మకం

* మరోవైపు పూర్వకాలంలో ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పరదాలు కట్టి వివాహాన్ని జరిపేవాళ్లు.. అయితే ఆషాఢ మాసంలో గాలులు ఎక్కువ వస్తాయి కాబట్టి.. గాలి తీవ్రత వల్ల పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు.. భోజనాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం కూడా ఉందని.. అందరి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఈ నిబంధన తెచ్చి ఉండవచ్చు. 

ఇక కొత్తగా పెళ్లయిన వారిని ఎందుకు దూరంగా ఉండమన్నారంటే.. ఈ మాసంలో భార్యాభర్తలిద్దరూ కలిసిన పక్షంలో భార్య గర్భం దాలిస్తే.. ఆమె ప్రసవం మండు వేసవిలో జరుగుతుంది. ఆ సమయంలో ఉండే వేడిమిని తల్లి, బిడ్డా ఇద్దరూ తట్టుకోలేరు.. అందువల్లే కొత్త కోడలిని అత్తింటివారు.. ఆమె పుట్టింటికి పంపేస్తారు.

ఆషాఢం వచ్చిందంటే చాలు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు.. ఈ మాసం వచ్చే నాటికి వర్షరుతువు ప్రభావం వల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఈ మార్పుల వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది.. లే లేత గోరింటాకు పెట్టుకోవడం వల్ల బయట వాతావరణానికి అనుగుణంగా అది మన శరీరాన్ని కూడా చల్లబరుచుతుందట. 
 

Follow Us:
Download App:
  • android
  • ios