పిల్లలకు తొందరెందుకు అనుకుంటే...

ఒకప్పుడు అమ్మాయిలు.. 15ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేసుకొని వెంటనే పిల్లలను కనేసేవారు. ఇప్పుడు కాలం మారింది అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు.

How old is too old for a safe pregnancy?

ఒకప్పుడు అమ్మాయిలు.. 15ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేసుకొని వెంటనే పిల్లలను కనేసేవారు. ఇప్పుడు కాలం మారింది అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నతి సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం.. పిల్లలను ఆలస్యంగా కనడం లాంటివి చేస్తున్నారు.

15ఏళ్లకు పెళ్లి చేసుకొని పిల్లలను కనడం కరెక్ట్ కాదు నిజమే. కానీ 25ఏళ్లు దాటినా  పిల్లలను కనకపోతే సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్లు దాటాక పిల్లలను కనడం చాలా కష్టం. పెళ్లికి తగిన వయసు 20 నుంచి 25ఏళ్లు. ఈ వయసు కంటే ముందు గర్భాశయం పూర్తిగా వికసించదు. గర్భం దాల్చడానికి తగినట్టుగా శరీరం ఎదిగి ఉండదు.

20 నుంచి 25 ఏళ్లలో నాణ్యమైన అండాలు విడుదలౌతాయి. దీంతో ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది. 25ఏళ్లు దాటిన తర్వాత నుంచి అండాల నాణ్యత సన్నగిల్లుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పిల్లలు కావాలనుకునేవారు 30 ఏళ్లలోపే బిడ్డకు జన్మనివ్వాలి. వ్యక్తిగత కారణాల వల్ల గర్భం దాల్చడాన్ని వాయిదా వేయాలని అనుకుంటే.. అండాలను ఎగ్ బ్యాంక్ లో నిల్వ చేసుకోవాలి. అప్పుడు కావాల్సిన సమయంలో గర్భం దాల్చవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios