Asianet News TeluguAsianet News Telugu

హార్ట్ ఎటాక్ దూరంగా ఉంచే పండు ఇది..!

మలబద్ధక సమస్యతో బాధపడేవారికి ఈ పండు చక్కని పరిష్కారం. ఈ పండు తీసుకుంటే... మలబద్ధక సమస్య తీరిపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. తద్వారా మలబద్ధక సమస్య తగ్గుతుంది.
 

Health and Nutrition Benefits of Pears
Author
Hyderabad, First Published Sep 11, 2019, 4:04 PM IST

పియర్ పండు... మార్కెట్లో లభించే పండ్లలో ఇది కూడా ఒకటి. ఎక్కువ మంది వీటిని తిని ఉండరు. దీని గురించి తెలియక చాలా మంది ఈ పండను పట్టించుకోవడం లేదు. నిజానికి ఈ పండు గురించి తెలిసిస్తే... తినకుండా ఉండలేరు. ఈ పియర్ పండు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి ఆ లాభాలేంటో ఓసారి మనమూ లుక్కేద్దామా...

ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్నవయసులోనే హార్ట్ ఎటాక్ కి గురౌతున్నారు. అయితే... ఈ పియర్ పండ్లు తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది.  పియర్స్ పండ్లను రెగ్యులర్‌గా తింటే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాని పలువురు డచ్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. పియర్స్ పండ్లను తరచూ తినడం వల్ల స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు 52 శాతం వరకు తక్కువగా ఉంటాయట.

పియర్ పండ్లలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీర్ణాశయం, పేగుల్లో ఉండే మంచి బాక్టీరియా మరింత వృద్ధి చెందుతుంది.

మలబద్ధక సమస్యతో బాధపడేవారికి ఈ పండు చక్కని పరిష్కారం. ఈ పండు తీసుకుంటే... మలబద్ధక సమస్య తీరిపోయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. తద్వారా మలబద్ధక సమస్య తగ్గుతుంది.

పియర్స్ పండ్లను తినడం వల్ల అధిక బరువు తగ్గవచచని, గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

రక్తహీనత సమస్య ఉన్నవారు, పుట్టుకతో లోపాలు ఉన్నవారు, ఎముకలు, దంతాలు సమస్యలు కలిగిన వారు పియర్స్ పండ్లను తింటుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి నెమ్మదిగా బయట పడవచ్చు. అలాగే పియర్స్ పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios