Asianet News TeluguAsianet News Telugu

హ్యాపీ చాక్లెట్ డే.. ఇష్టమైన వారితో మరింత తీయగా ప్రేమ పండుగ..

అందమైన క్షణాలకు కమ్మని చాక్లెట్ విందు ఎంత మధురమైన అనుభూతిని కలిగిస్తుందో మాటల్లో చెప్పలేం. అలాంటిది ఈ రోజు చాక్లెట్ డే. ఈ వాలెంటైన్స్ వీక్ లో వచ్చే చాక్లెట్  డే సందర్భంగా మీ ప్రియమైన వారిని ఎలా విష్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Happy Chocolate Day 2023: Wishes, Images, Quotes, Greetings, WhatsApp & Facebook Status
Author
First Published Feb 9, 2023, 9:39 AM IST

Happy Chocolate Day 2023: అందమైన అమ్మాయికి రోజ్ ఇచ్చి.. ప్రపోజ్ చేసిన తర్వాత ఒక తీయని చాక్లెట్ తో వేడుక చేసుకోవడమే మిగిలి ఉంటుంది కదా.. అందుకే వాలెంటైన్స్ వీక్ లో రోజ్ డే, ప్రపోజ్ డే అయిపోయిన తర్వాత చాక్లెట్ డేని జరుపుకుంటారు. మీకు తెలుసా..? ఒక తీయని చాక్లెట్ మన మనలోని ఎన్నో భావాలను అవతలి వ్యక్తికి మధురంగా చెబుతుంది. అందుకే ఈ చాక్లెట్లను ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు. వాళ్లకు వాళ్లు తినడమో లేకపోతే ఇష్టమైన వాళ్లకు ఇవ్వడమో చేస్తుంటారు.  ఏదేమైనా అమ్మాయిలకు చాక్లెట్స్ అంటా మహా పిచ్చి. అందులోనూ ఇష్టమైన వాళ్లు చాక్లెట్లు ఇస్తే వచ్చే ఆనందాన్ని హగ్ రూపంలో తిరిగిచ్చినా  ఆశ్చర్యపోవక్కర్లేదు తెలుసా.. మరి ఇంతటి మధురమైన రోజున ప్రియమైన వారికి చాక్లెట్ డే శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • అచ్చం ఈ చాక్లెట్లలాగే నువ్వు  నా జీవితాన్ని మాధుర్యం, ప్రేమతో నింపావు. హ్యాపీ చాక్లెట్ డే మై డియర్ !
  • నీ ప్రేమ నాకు హాట్ చాక్లెట్ లాంటిది. ఇది నన్ను ఎల్లప్పుడూ వెచ్చగా, సంతోషంగా ఉంచుతుంది. ఈ చాక్లెట్ డే సందర్భంగా నా ప్రేమను నీకు పంపుతున్నాను.
  • నా రోజు నాకెంతో ప్రత్యేకమైంది. నా జీవితాన్ని ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉంచుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్.. హ్యాపీ చాక్లెట్ డే బేబీ
  • ఈ చాక్లెట్ డే నాకు నిజంగా ప్రత్యేకమైంది. నా జీవితానికి సరిపడా ఎన్నో మధరానుభూతులు కలిగించిన నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి.. హ్యాపీ చాక్లెట్ డే, మై లవ్.
  • నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్స్. నీను నా జీవితాన్ని కాంతులతో నింపావు. హ్యాపీ చాక్లెట్ డే డార్లింగ్.
  • చాక్లెట్ మాటల కంటే తియ్యగా ఉంటుంది. చాక్లెట్ డే సందర్భంగా నీకు ప్రేమతో హృదయపూర్వక శుభాకాంక్షలు. 
  • నీలోనే నా బెస్ట్ ఫ్రెండ్, సోల్ మేట్ దొరకడం నా అదృష్టం. ఇంతకు ముందెన్నడూ లేనంత గొప్పగా ఏదీ అనిపించలేదు. హ్యాపీ చాక్లెట్ డే పార్టనర్.
  • నీ చిరునవ్వుతో నా హృదయాన్ని, ఆత్మను బంధించావు. హ్యాపీ చాక్లెట్ డే !
  • మీరు చేసే పనులన్నీ చాలా బాగుంటాయి. .కానీ అన్నింటికంటే అందమైనది నాకూ నీకూ మధ్య ఉన్న స్నేహం!ఈ చాక్లెట్లను నీతో పంచుకున్నప్పుడు ప్రతిక్షణం ఆనందంగా మారుతుంది. హ్యాపీ చాక్లెట్ డే!
  •  జీవితం చాక్లెట్ మాధుర్యంతో నిండిపోవాలి. హ్యాపీ చాక్లెట్ డే !
  • ప్రతి రోజూ నువ్వు నాకు స్పెషలే.. నువ్వు గమనించావో లేదో.. నిన్నటి కంటే ఎక్కువగా ప్రతిరోజూ నువ్వు నన్ను సరికొత్తగా ప్రేమలో పడేలా చేస్తావు. ఐ లవ్ యూ డియర్! హ్యాపీ చాక్లెట్ డే. 
  • నా జీవితాన్ని సరికొత్తగా మార్చావు. నీ సపోర్ట్, నీ ఉనికి లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో నేను ఊహించలేను. హ్యాపీ చాక్లెట్ డే !
  • ఈ చాక్లెట్లు నీకు సంతోషాన్ని ఇచ్చినట్టే.. నీవు నా జీవితంలో ఆనందాన్ని తెచ్చావు. చాక్లెట్ డే శుభాకాంక్షలు డియర్ !
Follow Us:
Download App:
  • android
  • ios