Guru Poornima 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. గురు పూర్ణిమను ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. వేదవ్యాస మహర్షి గురు పౌర్ణమి రోజునే జన్మించాడని నమ్ముతారు. అందుకే ఆ రోజున వ్యాస పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. 

Guru Poornima 2023: ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై 3న అంటే సోమవారం వచ్చింది. గురు పౌర్ణమి రోజున గురువు ఆశీస్సులు తీసుకుంటే సుఖసంతోషాలు, సంపద, శాంతి లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గురుపౌర్ణమి రోజునే వేద వ్యాసుడు జన్మంచాడు కాబట్టి ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. 

గురు పూర్ణిమకు హిందూమతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురువు స్థానం ఉన్నతమైనదని, ఉత్తమమైనదని నమ్ముతారు. నిజానికి గురువు దేవుడి కంటే గొప్పవాడు. గురువు లేకుంటే మన బతుకు ఎలా ఉండేదో. గురువు నేర్పిన మంచి చెడులు, అక్షరాలే మనం మంచి మనుషుల్లా ఎదగడానికి తోడ్పడుతున్నాయి. అజ్ఞానపు అంధకారం నుంచి గురువే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అందుకే తల్లిదండ్రుల రుణమైనా తీర్చుకోవచ్చు కానీ గురువు రుణం మాత్రం తీర్చుకోలేం అంటారు. గురు పూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమ శుభ ముహూర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గురు పూర్ణిమ శుభ ముహూర్తం

గురుపూర్ణిమ జూలై 02 న రాత్రి 08: 21 గంటలకు ప్రారంభమై జూలై 93 సాయంత్రం 05:08 గంటలకు ముగుస్తుంది. 

గురు పూర్ణిమ ప్రాముఖ్యత 

గురు పూర్ణిమ రోజునే వేదవ్యాస మహర్షి జన్మించారని ప్రతీతి. సనాతన ధర్మంలో.. వేద వ్యాస మహర్షికి మొదటి గురువు హోదా ఉంది. ఎందుకంటే ఈయన సమస్త మానవాళికి వేదాలను భోధించిన మొదటి వ్యక్తి. శ్రీమద్భగవత్, మహాభారతంతో పాటుగా 18 పురాణాలను రచించారు వేద వ్యాస మహర్షి. అందుకే మహర్షిని వేద వ్యాసానికి ఆది గురువుగా భావిస్తారు. అందుకే గురు పౌర్ణమి రోజున వేదవ్యాస మహర్షిని ప్రత్యేకంగా పూజిస్తారు. 

గురు పూర్ణిమ శుభ యోగా

గురు పూర్ణిమ రోజున ఈ సారి ఎన్నో శుభ యోగాలు ఆవిర్భవించబోతున్నాయి. ఈ రోజున బ్రహ్మ యోగం, ఇంద్రయోగం ఏర్పడతాయి. అలాగే బుధాదిత్య యోగం కూడా ఏర్పడనుంది. అదికూడా సూర్యుడు, బుధుడి కలయికతో. జూలై 2 న రాత్రి 07:26 గంటల నుంచి జూలై 03 వ తేదీన మధ్యాహ్నం 3: 45 గంటల వరకు బ్రహ్మయోగం జరగనుంది. ఇకపోతే ఇంద్రయోగం జూలై 3 మధ్యాహ్నం 03:45 గంటలకు ప్రారంభమై జూలై 4 న ఉదయం 11.50 గంటలకు ముగుస్తుంది. 

గురు పూర్ణిమ పూజా విధి

ఈ రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రతిజ్ఞ చేసి శుభ్రమైన ప్లేస్ లో తెల్లన్ని వస్త్రాన్ని ఉంచి వ్యాస పీఠాన్ని నిర్మించాలి. తర్వాత దానిపై గురువ్యాస విగ్రహాన్ని ప్రతిష్టించి గంధం, పూలు, పండ్లు, ప్రసాదం సమర్పించాలి. గురు వ్యాస మహర్షితో పాటుగా శుక్రుడు, శంకరాచార్య వంటి గురువులను కూడా ప్రార్థించి "గురుపరపరసిద్ధార్తన్ వ్యాసపూజం కరిష్యే" అనే మంత్రాన్ని జపించాలి.