‘‘నోరూరించే రుచులు.. ఉర్రూతలూగించే సంగీతం’’.. మాదాపూర్ లోని హైటెక్స్ గ్రౌండ్ వేదికగా మారింది. ఇక్కడ బ్రింగ్ యువర్ ఓన్ బెల్లీ ఫుడ్ పేరిట భోజన ప్రియుల కోసం సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఇక్కడ ఏర్పాటు చేసిన వేలాది రకాల వంటకాలు.. భోజన ప్రియులను ఆకట్టుకున్నాయి.

రెస్టారెంట్, ఫుడ్ ట్రాక్స్, చెఫ్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. లంచ్  నుంచి డిన్నర్ వరకు తమకు కావాల్సిన వంటకాన్ని విజిటర్స్ రుచి చూశారు. వంటలు మాత్రమే కాదు.. చిన్నారుల కోసం కిడ్స్ జోన్, కుకింగ్ వర్క్ షాప్, ఫుడ్ బ్లాగర్స్, ఫ్లీ మార్కెట్ ఇలా రకరకాల వెరైటీ ప్రదర్శనలు కూడా చేపట్టారు. వీటికి తోడు లైవ్ బ్యాండ్ మ్యూజిక్ సందర్శకులను ఉర్రూతలూగించింది.