శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించే ఫుడ్స్ ఇవి..

మూడు పదులకే ఒబేసిటీ, కొలెస్ట్రాల్, షుగర్, బ్లడ్‌ప్రెజర్ వంటి కారణాలతో ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.   ఆహారపు అలవాట్లు, తినే ఆహారం మారిన జీవనశైలి ఇలా కారణం ఏదైనా సమస్య మాత్రం తీవ్రతరంగా ఉంటోంది.

fat burning foods list is here

ప్రస్తుత కాలంలో అందరినీ వేధిస్తున్న కామన్ సమస్య కొలిస్ట్రాల్.  మూడు పదులకే ఒబేసిటీ, కొలెస్ట్రాల్, షుగర్, బ్లడ్‌ప్రెజర్ వంటి కారణాలతో ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడతుంది.   ఆహారపు అలవాట్లు, తినే ఆహారం మారిన జీవనశైలి ఇలా కారణం ఏదైనా సమస్య మాత్రం తీవ్రతరంగా ఉంటోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల సమస్యని అదిగమించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా... 

పసుపు..రోజూ తినే వాటిలో వీలైనంత వరకు పసుపు వాడకం ఉన్నా.. కాస్త మోతాదు పెంచి వాడితే గుండెకు మంచిది. లో డెన్సిటీ లిపొప్రొటైన్(ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

 యాలకులు..తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతేనే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఇదివరకే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును  తొలగించే శక్తి యాలకులలో ఉంది.

కరివేపాకు... బరువుని తగ్గించేందుకు కరివేపాకులు మంచి మందు. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును తగ్గించేస్తాయి. ఇవి కూరల్లో కలిపి తిన్నా, రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే. 

వెల్లుల్లి.. ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని ‘ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్’ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

ఆలివ్ ఆయిల్... వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.

క్యాబేజీ... బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే మేలు.

తేనె... మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.

పెసరపప్పు.. కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios