బరువు తగ్గించే.. స్నాక్స్ ఇవి

బరువు తగ్గాలని చాలా మంది తిండి మానేస్తూ ఉంటారు. మరి కొందరు తమకు తోచింది ఏదిపడితే అది తింటూ ఉంటారు. అయితే.. అలా కాకుండా.. సరైన తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటే.. బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. 

Effective Benefits Of Sprouts For Weight Loss

బరువు తగ్గాలని చాలా మంది తిండి మానేస్తూ ఉంటారు. మరి కొందరు తమకు తోచింది ఏదిపడితే అది తింటూ ఉంటారు. అయితే.. అలా కాకుండా.. సరైన తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటే.. బరువు సులభంగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుందని.. అదేవిధంగా బరువు టెన్షన్ కూడా ఉండదంటున్నారు. మరి అవేంటో మనమూ చూసేద్దామా..

సెనగలు.. వీటిలో ప్రోటీన్స్, పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే.. తొందరగా ఆకలి వేయదు. కాబట్టి  సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. కూరగాయ ముక్కలు, నిమ్మరసం, ఉడికించిన సెనగలను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

మినపప్పు.. మినపప్పులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి. వీటితో చేసిన ఆహారాన్ని సాయంత్రం పూట తీసుకుంటే మంచిఫలితం ఉంటుంది.

నట్స్.. బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేయించి.. మొక్కజొన్నలతో కలిపి తీసుకుంటే మరింత రుచిగా కూడా ఉంటాయి. 

మొలకెత్తిన విత్తనాలు.. వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios