లైంగిక సామర్థ్యంపై ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం

First Published 23, Aug 2018, 12:58 PM IST
Eating fast food hurts women's chances of getting pregnancy?
Highlights

కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే కాదు..కొన్ని రకాల జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 

ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో చాలా మంది స్నాక్స్ గా వీటిని తీసుకుంటూ ఉంటారు. నూనెలో డీప్ ఫ్రై చేసి మరీ వీటిని తయారు చేస్తారు. మరి ఇవి ఎంతవరకు ఆరోగ్యకరం అంటే.. చాలా నష్టం ఉందంటున్నారు నిపుణులు. ఫ్రెంచ్ ఫ్రైని ఎక్కువగా తినే మహిళల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోయి.. సంతానోత్పత్తి కలగకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. 

కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే కాదు..కొన్ని రకాల జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మహిళలు బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, పిజ్జా మరియు చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ ను తీసుకుంటూ ఫ్రూట్స్ ని తక్కువగా తీసుకోవడం వలన గర్భం దాల్చే అవకాశాలు తక్కువవుతాయని ఆస్ట్రేలియాలోని యూనివెర్సిటీ ఆఫ్ అడిలైడ్స్ రాబిన్సన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

అందుకే సంతానం కావాలనుకునే మహిళలు జంక్ ఫుడ్స్.. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ అంతా ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలని అనిపిస్తే.. దానికి ఆల్టర్నేటివ్ చిప్స్ తినడం మేలని చెబుతున్నారు. బేక్డ్ చిప్స్, బనానా, ఆపిల్స్ లేదా ఏవైనా ఫ్రూట్స్ ను ఆల్మండ్ బటర్ తో కలిపి తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 

loader