Health Tips: రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగితేనే మనం అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ఈ నీళ్లను తిన్నవెంటనే తాగడం అంత మంచిది కాదంటున్నారు. ఎందుకంటే..?
Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకు మూడు నాలుగు లీటర్ల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. శరీరానికి సరిపడా నీళ్లను తాగితేనే మనం హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా ఉంటాం. కానీ తిన్న వెంటనే నీళ్లను తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
తిన్నవెంటనే నీళ్లను తాగితే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిన్నారు. అయితే చిన్న పిల్లలు మాత్రం తిన్నవెంటనే నీళ్లను తాగొచ్చు. కానీ పెద్దవారు మాత్రం తిన్నాక ఎట్టి పరిస్థితిలో నీళ్లను తాగకూడదని హెచ్చిరిస్తున్నారు.
మనం తిన్న ఆహారం జీర్ణం అవడానికి సుమారుగా రెండు గంటలు పడుతుంది. ఆ సమయంలో మీరు నీళ్లను తాగితే జీర్ణక్రియపై ప్రభావం పడి అజీర్థి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అయితే తిన్న వెంటనే కాకుండా తిన్న 45 నుంచి ఒక గంట తర్వాత కావాల్సినన్ని నీళ్లను తాగొచ్చని చెబుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తినడానికి అరగంట ముందే నీళ్లను తాగాలట.
ఏ సమయంలో నీళ్లను తాగితే ఆరోగ్యానికి మంచిది..
- ఆహారం తీసుకున్న గంట తర్వాతనే నీళ్లను తాగితే మీ వెయిట్ నియంత్రణలో ఉంటుంది.
- తిన్న 45 నిమిషాల తర్వాత నీళ్లను తాగితే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
- సరైన సమయంలో నీళ్లను తాగితే ఎసిడీటీ, గ్యాస్ట్రిక్, కడుపులో నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
- ముఖ్యంగా తిన్న గంట తర్వాత నీళ్లను తాగితే మనం తిన్న పోషకవిలువలన్నీ శరీరంలో బాగా కలిసిపోతాయి.
- అంతేకాదు కరెక్ట్ టైంలో నీళ్లను తాగితే హాయిగా నిద్ర కూడా పడుతుంది.
తిన్న వెంటనే నీళ్లను తాగడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి..
1. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి
2. ఊబకాయం బారిన పడతారు
3. Digestion సమస్యలు వస్తాయి
4. కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి
