ఒంటికి అంటిన రంగులు చర్మాన్ని పాడుచేయకుండా ఉంటుంది. తర్వాత శుభ్రం చేసుకున్నా కూడా రంగులు సులభంగా తొలగిపోతాయి.

హోలీ..అందమైన రంగుల పండగగ. ఈ రోజున... ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వారికి రంగులు పూసి...ఆనందంగా జరుపుకుంటారు. అయితే... ఈ పంగను జరుపుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఈ హోలీ పండగ రోజున చేయాల్సినవి ఏంటి..? చేయకూడనివి ఏంటో ఓసారి చూద్దాం..

చేయాల్సినవి...
1.ఈ రంగుల పంగ రోజున ఒకరికి మరొకరు రంగులు పూసుకుంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. మీరు ఈ సారి ఎవరికైనా రంగు పూసే సమయంలో వారి అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. ఇష్టం లేకుండా... ఎవరికీ రంగులు పూయకూడదు. వారికి ఇష్టమైతేనే పూయాలి.

2.హోలీ జరుపుకోవడానికి సిద్ధమవ్వగానే... ముందుగానే చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇలా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల... ఒంటికి అంటిన రంగులు చర్మాన్ని పాడుచేయకుండా ఉంటుంది. తర్వాత శుభ్రం చేసుకున్నా కూడా రంగులు సులభంగా తొలగిపోతాయి.

3.హోలీకి ఉపయోగించే రంగులు ఆర్గానిక్ వి ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా... కెమికల్స్ ఉన్న రంగులు వాడటం వల్ల.. చర్మం పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... వీలైనంత వరకు ఆర్గానిక్ కలర్స్ వాడటం ఉత్తమం.

4. హోలీ రంగులు పూూసుకోవడానికి ముందు.. చర్మానికి, జుట్టుకి ఆయిల్ రాసుకోవడం మంచిది. దీని వల్ల.. చర్మంతో పాటు.. జుట్టు కూడా పాడవ్వకుండా ఉంటుంది.


చేయకూడనివి...

1. ఎవరికీ బలవంతంగా రంగులు పూయకూడదు. మీకు రంగులు పూయడం సరదా కావచ్చు. కానీ.... ఇతరులకు సరదా కాకపోవచ్చు. కాబట్టి... ఎవరినీ ఈ విషయంలో బలవంత పెట్టకూడదు.

2. ఇక హోలీ అనగానే అందరూ.. ఫుల్ గా మందు తాగేస్తారు. ఆ మత్తులో మరింత రెచ్చిపోతూ ఉంటారు. అయితే.. సరదాగా కొంచెం తాగడం వరకు ఒకే కానీ.... ఫుల్ గా తాగేయకూడదు. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.

3.చాలా మంది హోలీ వేడుకలో మెటాలిక్ కలర్స్ వాడుతూ ఉంటారు. ఇవి అస్సలు ఉపయోగించకూడదు. అవి చర్మానికి చాలా ఎక్కువ హాని చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

4.చాలా మంది హోలీ ఆడిన తర్వాత... ఆ రంగులను తొలగించడానికి చాలా మంది కిరోసిన్ వాడుతూ ఉంటారు. అది చాలా ప్రమాదం. కాబట్టి... రంగులను తొలగించడానికి కిరోసిన్ కాకుండా.... నూనె, క్లెన్సింగ్ వాటర్ లాంటివి ఉపయోగించడం మంచిది.