ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు.? అలా చేయకపోతే ఏం జరుగుతుంది..

దాదాపు ప్రతీ ఒక్క హిందువు ఇంటి ముందు కచ్చితంగా గుమ్మడికాయ వేలాడుతూ కనిపిస్తుండడం సర్వసాధారణం. చిన్న ఇల్లు మొదలు, పెద్ద భవంతి వరకూ ప్రతీ ఒక్కరూ కచ్చితంగా తమ ఇల్ల ముందు గుమ్మడి కాయను వేలాడదిస్తుంటారు. ఇంతకీ గుమ్మడి కాయను ఇంటి ముందు ఎందుకు వేలాడదీస్తుంటారు.? అసలు ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Do you know why people usually keep pumpkin in front of home VNR

పేదలు మొదలు ధనికుల వరకు ప్రతీ ఒక్కరూ తమ ఇంటికి ఒక గుమ్మడి కాయను వేలాడదీస్తుంటారు. దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో చాలా మంది ఇంటి ముందు గుమ్మడి కాయను వేలాడదీస్తారు. గుమ్మడికాయ ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి కాలభైరవుడు రక్షగా ఉన్నట్లు విశ్వసిస్తుంటారు. ఇంటికి దిష్టి మొదలు, ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా గుమ్మడికాయ దూరం చేస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇంటిపై ఉండే నర ఘోష, నరదృష్టి వంటి అనే దోషాల నుంచి గుమ్మడికాయ రక్షిస్తుందని హిందువులు నమ్ముతుంటారు. 

ఇంటి ముందు గుమ్మడి కాయ వేలాడదీయడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్‌ ఎనర్జీ రాకుండా ఉంటుందని చెబుతుంటారు. ఇంటి ముందు వేలాడదీసే గుమ్మడికాయ పాడవ్వకుండా చూసుకోవాలని చెబుతుంటారు. ఒకవేళ కాయ త్వరగా కుళ్లిపోతే ఆ ఇంటిపై నరదృష్టి ఎక్కువగా ఉందని నమ్ముతారు. అయితే ఇంటి ముందు గుమ్మడి కాయను వేలాడదీసే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ గుమ్మడి కాయను కట్టే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి.? గుమ్మడి కాయను వేలాడదీయడానికి సరైన సమయం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 


ఇలా చేయకూడదు.. 

మనలో చాలా మంది గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడే దీసే ముందు కడుగుతుంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది గుమ్మడి కాయను నీటితో కడిగి దానికి కుంకుమ పపుపు వంటివి పెడుతుంటారు. అయితే ఇలా కడగడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. గుమ్మడికాయను కడగడం వల్ల దానికి ఉండే పాజిటివ్ ఎనర్జీ పోతుందని చెబుతున్నారు. అందుకే గుమ్మడి కాయకు నేరుగా కుంకుమ, పసుపు పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలని సూచిస్తున్నారు. 

ఇలా కడితే ప్రయోజనం ఉండదు 

ఇక గుమ్మడి కాయను కట్టే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గుమ్మడికాయ తోడిమ లేకుండా కడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. దీనివల్ల దానికి ఉండే శక్తులన్నీ పోతాయని అంటున్నారు. అందుకే గుమ్మడికాయ కట్టడం వల్ల లాభాలు ఉండాలంటే కచ్చితంగా దాని తొడిమా ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక గుమ్మడికాయను తొడిమ కిందికి ఉండేలా కడితే కూడా ప్రయోజనం ఉండదని అంటున్నారు. దీనివల్ల గుమ్మడి కాయ నుంచి నెగిటివ్‌ ఎనర్జీని తొలగించే శక్తి పోతుతుందని విశ్వసిస్తుంటారు. 

ఏ రోజున కట్టాలి, ఎలా కట్టాలి.? 

బూడిద గుమ్మడికాయన ఇంటి ముందు కట్టే విషయంలో రోజు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెచెబుతున్నారు. అమావస్య రోజు సూర్యోదయానికి ముందే గుమ్మడి కాయను కడితే మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమయంలో గుమ్మడి కాయను కడితే కనుదిష్టి, నరదిష్టి పోతుతుందని అంటున్నారు. ఒకవేళ అమవాస్య రోజునే వీలుకాకపోతే బుధవారం లేదా శనివారం మంచిదని చెబుతున్నారు. అయితే రాత్రుళ్లు కడితేనే ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఇక గుమ్మడి కాయను కట్టే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ముందుగా బూడిద గుమ్మడికాయను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానికి పసుపును రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత గుమ్మడి కాయకు స్విస్తిక్‌, ఓమ్‌ సింబల్స్‌ను కుంకుమతో రాయాలి. అనంతరం గుమ్మడికాయను జాలిలో కట్టి ఇంటి ముందు వేలాడా దీయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించనవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios