పిల్లలకు తల్లిదండ్రుల స్పర్శ ఎంత అవసరమో తెలుసా..?
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పిల్లలకు స్మార్ట్ ఫోన్లకు మధ్య గట్టి అనుబంధం ఏర్పడుతుంది. ఇది అస్సలు మంచిది కాదు. పిల్లలకు ఎలక్ట్రానిక్ వస్తువుల అవసరం కాదు.. తల్లిదండ్రుల స్పర్శ ఎంతో అవసరం. ఇది లేకుండబట్టే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య బాండింగ్ తగ్గుతుంది.
కాలం మారింది... కాలంతో పాటుగా మనుషుల అలవాట్లు కూడా మారుతున్నాయి. కాని కొన్ని రకాల అలవాట్లు ప్రేమకు, అనుబంధానికి దూరం చేస్తున్నాయి. అవే పిల్లలకు , తల్లిదండ్రులకు మధ్య అంతులేని ప్రేమను దూరం చేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లలు ప్రేమగా దగ్గరకు తీసుకుని బుజ్జగించడమో.. లేకపోతే నవ్వించడమో, ఆడించడమో చేస్తుండేవారు. కానీ ఈ టెక్నాలజీ యుగంలో పిల్లలకు తల్లిదండ్రుల స్పర్శ కరువైంది.
ఈ స్పర్శ లేకపోవడం వల్లే పిల్లలకు , తల్లిదండ్రులకు మధ్య సరైన అనుబంధం ఉంటడం లేదు. పిల్లలు మా మాట వినడం లేదు అని వాపోతున్నారు. దానికి పిల్లల్ని కాదు నిందించాల్సింది ఆ పిల్లల తల్లిదండ్రులను. అవును ముమ్మాటికీ పిల్లల తల్లిదండ్రులనే నిందించాలి.
టెక్నాలజీ యుగంలో పిల్లలకు ఇవ్వాల్సింది ఎలక్ట్రానిక్ వస్తువులు కాదు.. మీ సర్శ కావాలి. అమితమైన ప్రేమ కావాలి. వాటివల్లే వారు శారీరకంగా మానసికంగా ఎదగలుగుతారు. అందులోనూ టీచర్లు కూడా పిల్లలను భయపెట్టించి చదివిస్తుంటారు. దీనివల్ల వారు చదవడం కాదు కదా.. మరీ మొండిగా తయారవుతారే తప్ప వారిలో మార్పు రాదు. ఒకరకంగా చెప్పాలంటే టీచర్లు పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తితే.. వారు ఒక మెషిన్ లా తయారవుతారు. ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు అంటే ఏంటో తెలియకుండా..
కానీ పిల్లలు మానసికంగా కానీ.. శారీరకంగా కానీ ఎదగాలంటే వారికి కేవలం పోషకాహారం ఇస్తే సరిపోదు. తల్లిదండ్రులు పిల్లలతో గడిపేందుకు సమయం కూడా కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల స్పర్శ కావాలి. అప్పుడే వారు అన్ని విధాల డెవలప్ అవుతారు.
మీకు తెలుసా.. పిల్లలు ఏదైనా సాధించినప్పుడో.. లేకపోతే గొప్పపని చేసినప్పుడో వారిని అభినందిస్తూ ప్రేమగా దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటే వారెంతో పొంగిపోతారు. అంతేకాదు వారు మీరు చెప్పిన మాట వింటారు.
అల్లరి చేస్తున్నప్పుడు వారిని కొట్టకండి.. ఈ సారి ప్రేమగా దగ్గరకు తీసుకుని వద్దు బిడ్డా అని కౌగిలించుకుని చెప్పండి.. అప్పుడు వింటారు మీ మాట. స్పర్శ ఇద్దరి వ్యక్తుల మధ్య అనుబంధాన్ని ప్రేమను పెంచుతుంది. మీ పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది. మీ మధ్య బంధాన్ని పెంచుతుంది.
ముఖ్యంగా చిన్నపిల్లలకు తల్లిస్పర్శ ఎంతో అవసరం. ఆ స్పర్శతోనే ఆ శిశువు ఎదగగలుగుతాడు. ఆ వెచ్చని కౌగిలినే రక్షణగా ఫీలవుతాడు. ఇదే సేఫ్ ప్లేస్ అని భావిస్తారు. దీనివల్ల మీకు మీ బిడ్డకు గట్టి అనుబంధం ఏర్పడుతుంది.
తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది బలమైన ఆహారం, బట్టలు, పుస్తకాలు, మంచి లైఫ్ యే కాదు వారితో కాస్త టైం కూడా కేటాయించండి. దీనివల్ల వారికి నాకు కష్టాలు రాకుండా చూసుకోవడానికి ఒకరున్నారు అనే భావన కలుగుతుంది.
పిల్లలతో మాట్లాడటం, వారిని అభినందించడం, వారిలో ఆడుకోవడం వంటివి వారికి మీకు మధ్య గట్టి బంధాన్ని ఏర్పరుస్తాయి. ముఖ్యంగా శారీరక స్పర్శ ద్వారే మీ బిడ్డ భావోద్వేగ సూచనలను పంచుకుంటారు. ఆ స్పర్శ వారికి కొండంత ధైర్యాన్ని అందిస్తుంది.
మీ మాట, స్పర్శ, స్వరం వంటి శారీరక కదలికల ద్వారా లేదా హావభావాల నుంచే మీ బిడ్డ ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.
ఏడుస్తున్న పిల్లవాడు తల్లిదండ్రులు తాకగానే ఏడుపు మానేస్తుంటారు. కారణం వారికి మీరు రక్షణ కల్పిస్తారని. మీరుంటే వారు సేఫ్ అని భావిస్తుంటారు. ఈ స్పర్శే వారి బాధను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు వారిని ఉత్తేజంగా మారుస్తుంది. సానుకూలంగా ప్రవర్తించడానికి ప్రోత్సహిస్తుంది.
మీకు తెలుసా.. తల్లిదండ్రుల స్పర్శ వల్ల పిల్లల బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుంది. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకునేలా ఎదుగుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్పర్శ వల్ల వారి శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీని వల్ల పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. అంతేకాదు అనుబంధాలు కూడా పెరుగుతాయట.
పలు పరిశోధన ప్రకారం.. శిశువుకు మసాజ్ చేయడం వల్ల వారు విశ్రాంతిగా ఫీలవుతారట. అలాగే గందరగోలం నుంచి బయటపడతారట.
పిల్లల్ని కౌగిలించుకోవడం వల్ల వారిలో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతతాయి. వీటివల్ల పిల్లల్లో చికాకు, అలసట, ఒత్తిడి వంటివి మటుమాయం అయ్యి వారు చురుగ్గా మారిపోతారు. దాంతో వారు ఆటల్లో, చదువులో రాణిస్తారు. మంచి నడవడికను అలవాటు చేసుకుంటారు.
అంతేకాదు ఈ స్పర్శ వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మీ స్పర్శే వారి బూస్ట్ లా పనిచేస్తుంది. సమాజం పట్ల కూడా గౌరవంగా నడుచుకుంటాడు. పరిస్థితులను అర్థం చేసుకుంటాడు.కాబట్టి వారితో ప్రతిరోజూ కాసేపు టైం స్పెండ్ చేయండి.