బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ.. అటు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇటు ఇన్ స్టాగ్రామ్ లోనూ అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది.  దిశా.. ఇంటర్నెట్ లో ఓ సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు.. తన గురించి తెలియజేస్తూ.. కొత్త ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అందుకే ఆమెకు ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 19మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా దిశా.. తన ఇన్ స్టా స్టోరీస్ లో ఓ ఫోటో షేర్ చేసింది. కాగా.. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. పొట్టి బ్లాక్ కలర్ డ్రస్ లో దిశా మెరిసిపోతోంది. దిశా.. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్ ఫాలో అవుతోందంటూ అభిమానులు కూడా కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. 

తెలుగులో లోఫర్ సినిమాతో అలరించిన దిశా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన భారత్ లో నటిస్తోంది. ఈ సినిమాలో కత్రినాకైఫ్, వరుణ్ ధావన్, టబులాంటి నటులు కూడా నటిస్తున్నారు. ఇక దిశా పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె హీరో టైగర్ ష్రాఫ్ తో పీకల్లోతూ ప్రేమలో ఉందని బాలీవుడ్ టాక్. వీరిద్దరూ కలిసి నటించిన బాఘి2 సినిమా బాక్సాఫీసుని షేక్ చేసింది.

మేమిద్దరూ ఫ్రెండ్స్ అంటూ దిశా, టైగర్ చెబుతున్నప్పటికీ.. త్వరలో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న దిశా ఫోటో మీకు కూడా నచ్చేసింది కదా..