Asianet News TeluguAsianet News Telugu

శృంగారం విషయంలో అబ్బాయిల అపోహలివే..

తొలిసారి శృంగారంలో పాల్గొనాలి అంటే ఎవరికైనా కాస్త కంగారుగానే ఉంటుంది. మనదేశంలో సెక్స్ గురించి చర్చించుకోవడం కూడా పెద్ద నేరంగా పరిగణిస్తుంటారు.

common myths in youth over coupling
Author
Hyderabad, First Published Jun 24, 2019, 2:18 PM IST

తొలిసారి శృంగారంలో పాల్గొనాలి అంటే ఎవరికైనా కాస్త కంగారుగానే ఉంటుంది. మనదేశంలో సెక్స్ గురించి చర్చించుకోవడం కూడా పెద్ద నేరంగా పరిగణిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది తమకు ఉన్నడౌట్స్ ని లో లోపలే దాచేసుకుంటారు. చిన్న సమస్యను కూడా పెద్దదానిగా భావించి తమలో లోపం ఉందని భ్రమపడిపోతుంటారు. సాధారణంగా అబ్బాయిలకు ఉండే అపోహలు ఏంటో ఒకసారి చూద్దాం..

‘‘నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతృప్తి పరచలేనేమో అన్న భయంగా ఉంది’’ నూటికి 70శాతం మంది ఈ అపోహతో కుమిలిపోతుంటారు. నిజానికి..పురుషాంగ పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధమూ లేదు. సెక్స్‌లో భాగస్వామిని సంతృప్తిపరచడం ఒక కళ. ఆ కళలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. మీ జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి.. ఆమెను అర్థం చేసుకుంటే సరిపోతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది.

‘‘ మధుమేహం ఉంటే.. అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.శీఘ్రస్ఖలనమూ బాధిస్తోంది.’ ఈ సమస్యకూడా చాలా మందికి ఎదురౌతూ ఉంటుంది. పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బ తిన్నప్పుడు... ఆ వైపుగా రక్త ప్రవాహమూ తగ్గుతుంది. దీంతో, అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. అంతేకానీ, మధుమేహం ఉన్న అందరిలోనూ అంగస్తంభన లోపాలు తలెత్తవు.

‘‘ వారానికి రెండు సార్లు సెక్స్... ఆసక్తి తగ్గినట్టా..?’’ ఈ రకం అపోహ కూడా చాలా మందిలోనే ఉంటుంది. మీరు వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారంటే... లైంగిక ఆసక్తి ఉన్నట్టే. అంగస్తంభనా సరిగా ఉన్నట్టే. ఆ ప్రకారంగా మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అన్న విషయం గుర్తించాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios