శృంగారానికి అడ్డుకట్ట వేస్తున్న సిగరెట్

స్మోకింగ్ మనిషిని చంపేస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఆ అలవాటు ఉన్నవారు దానిని వదలుకోలేరు. చాలా మంది భార్యలకు తమ భర్తలు స్మోక్ చేయడం నచ్చదు. ముఖ్యంగా పడక గదిలోకి వచ్చే సమయంలో... స్మోక్ చేసి ఉండటాన్ని స్త్రీలు అంగీకరించరు.

Can smoking affect a man's erections?

స్మోకింగ్ మనిషిని చంపేస్తుంది. ఈ విషయం తెలిసినా కూడా ఆ అలవాటు ఉన్నవారు దానిని వదలుకోలేరు. చాలా మంది భార్యలకు తమ భర్తలు స్మోక్ చేయడం నచ్చదు. ముఖ్యంగా పడక గదిలోకి వచ్చే సమయంలో... స్మోక్ చేసి ఉండటాన్ని స్త్రీలు అంగీకరించరు. ఆ వాసన దాదాపు ఎవరికీ నచ్చదు. ఈ ఇష్టాయిష్టాలు పక్కన పెడితే... ఈ స్మోకింగ్ అలవాటు భవిష్యత్తులో మీ సెక్స్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం... సెక్స్, సిగరెట్.. తూర్పు పడమర లాంటివి అంటున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక్కటి మాత్రమే దొరకుతుందనేది వారి అభిప్రాయం. ఈ రెండింటిని ఒకేసారి పొందడం కష్టమనేది వారి వాదన. ఎందుకంటే.. సిగరెట్ లైంగిక వ్యవస్థ పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. 

సిగరెట్ లో ఉండే నికోటిన్ రక్త ప్రవాహ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంగ స్తంభన జరగాలంటే రక్తం అంగంవైపు ప్రవహించాలి. సిగరెట్ ఆ వేగానికి అడ్డుకట్ట వేస్తుంది. ఒక్కసారి అంగస్తంభన సమస్య మొదలైందంటే... గుండె సంబంధిత వ్యాధులు వస్తాయనడానికి సూచన.

 పొగతాగడం వల్ల... పరోక్షంగా భార్య కూడా తాగినట్టే. ధూమపాన పర్యవసానాల్ని ఆమె కూడా అనుభవించాల్సిందే. దీంతో తన లైంగిక ఆరోగ్యమూ ప్రమాదంలో పడుతుంది. రక్తప్రవాహ వేగం మందగించడంతో భావప్రాప్తి సమస్యలు వస్తాయి. యోనిలో లూబ్రికేషన్‌ తగ్గిపోతోంది. సెక్స్‌ బాధాకరం అవుతుంది. ఆ దుర్వాసన సెక్స్‌ పట్ల విరక్తి కలిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios