జుట్టుకు నూనెను రాస్తే జుట్టు బలంగా మారుతుంది. వెంట్రుకలు బలపడతాయి. నల్లగా, పొడుగ్గా పెరుగుతాయి. అంతేకాదు జుట్టుకు నూనె పెడితే చుండ్రు తగ్గిపోతుందని కొందరు నమ్ముతారు. అందులో నిజమెంతుందంటే..
ఆరోగ్యకరమైన జుట్టుకు హెయిర్ ఆయిల్ చాలా ముఖ్యం. మనలో చాలా మంది జుట్టు డ్రై అయినప్పుడో, దెబ్బతిన్నట్టుగా అనిపించినప్పుడో నూనెను పెడుతుంటారు. కానీ జుట్టుకు నూనెను పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టుకు నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలను మృదువుగా చేస్తుంది. నెత్తిమీద చుండ్రు లేకుండా చేస్తుంది. అయితే చుండ్రు సమస్యలకు జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
హెయిర్ ఆయిల్ చుండ్రును తగ్గిస్తుందా?
ఫంగస్ ఇన్ఫెక్షన్, నెత్తిమీద తేమ లేకపోవడం లేదా హెయిర్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చుండ్రు వస్తుంది. జుట్టుకు నూనెను అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుందనే దానిలో ఏ మాత్రం నిజం లేదు. కానీ జుట్టుకు తప్పుడు పద్దతిలో నూనెను అప్లై చేయడం వల్ల కూడా చుండ్రు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే కొంతమంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నూనె చుండ్రును ఆపకపోయినా.. మెడిసినల్ ఆయిల్ చుండ్రును కొంతవరకు తగ్గించడానికి సహాయపడుతుంది. నిజానికి హెయిర్ ఆయిల్ ను 3 నుంచి 4 గంటలు లేదా రాత్రంతా ఉంచుకుంటే చుండ్రు ఎక్కువ అవుతుంది. చుండ్రును నెత్తికి అంటుకునేలా చేస్తుంది. దీంతో ఇది చనిపోయిన చర్మ కణాలతో కలిసి దురద, చికాకు, జుట్టు రాలడానికి కూడా దారితీస్తుంది. ఇది జుట్టును అందంగా, బలంగా చేయడానికి, సాఫ్ట్ గా చేయడానికి సహాయపడుతుంది. కానీ ఇది చుండ్రుకు తగ్గించదు.
చుండ్రును తగ్గించే ఇంటి చిట్కాలు
గ్రీన్ టీ
చుండ్రును తగ్గించుకోవడానికి గ్రీన్ టీ బ్యాగ్ తీసుకొని వేడి నీటిలో 20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు నానబెట్టండి. దీనికి ఒక టీస్పూన్ వైట్ వెనిగర్, కొన్ని చుక్కల పిప్పరమింట్ ఆయిల్ ను కలపండి. దీన్ని తలకు తీసుకుని అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఐదు నిమిషాల తర్వాత సల్ఫేట్ లేని షాంపూతో కడగండి.
ఆపిల్ సైడర్ వెనిగర్
జుట్టును కడగడానికి సమాన పరిమాణంలో ఎసివి, నీటిని ఉపయోగించండి. ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. నెత్తిమీద దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నిమ్మరసం, కొబ్బరి నూనె
నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలపండి. దీన్ని నెత్తికి బాగా మసాజ్ చేసి కొన్ని నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత సాధారణ షాంపూతో జుట్టును వాష్ చేయండి. ఇది ఫంగస్ ను తొలగిస్తుంది. ఇది మీ జుట్టును చిక్కులు లేకుండా చేస్తుంది.
తాజా వేప ఆకులను ఉపయోగించండి
వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. తాజా వేపాలకు తీసుకొచ్చి పేస్ట్ గా చేసి తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేసి కండీషనర్ ను వాడండి. అలాగే వేప నీటిని తయారు చేసి కూడా వాడొచ్చు. దీనికోసం నీటిలో కొన్ని వేప ఆకులను మరిగించిన వడట్టండి. దీనిని కొబ్బరి నూనెతో కలిపి మీరు వాడే షాంపూలో వాడండి.
