Bridal beauty tips:  పెళ్లికూతురు అయ్యే వారు చాలా అందంగా కనిపించాలనుకుంటారు. మీరెన్ని నగలను వేసుకున్నా.. ఎంత అందమైన చీరను కట్టుకున్నా ముఖం అందంగా లేకపోతే అవన్నీ ఉండి దండుగే. అవును ముఖంతోనే మీ అందం రెట్టింపు అవుతుంది. మొటిమలు, మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. అందుకే  పెళ్లిచేసుకునే వారు పెళ్లికి ముందు కొన్ని ఆహారాలను తినడం మానేస్తే అందంగా కనిపిస్తారు. 

Bridal beauty tips: మొటిమలు ముఖ అందాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. మొటిమలు రావడం వాటివల్ల మచ్చలు ఏర్పడటం.. ఇవన్నీ ఉన్న అందాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. ముందే ఇది పెళ్లిళ్ల సీజన్. పెళ్లి చేసుకునే అమ్మాయిలు మరింత అందంగా కనిపించాలనుకుంటారు. ముఖ్యంగా మొటిమలు అసలే కాకూడదని భావిస్తారు. నిజానికి మీ చర్మ రంధ్రాలు బ్యాక్టీరియా, చనిపోయిన చర్మ కణాలతో మూసుకుపోయినప్పుడు మొటిమలు అవుతాయి. దీనికి తోడు శరీరం సెబమ్ అనే నూనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆయిలీ స్కిన్ కు దారితీస్తుంది. దీనివల్ల కూడా మొటిమలు ఏర్పడతాయి. అయితే మనం తినే ఆహారానికి మొటిమలకు సంబంధం ఉందంటున్నారు నిపుణులు. అవును కొన్ని రకాల ఆహారాలను తింటే కూడా మొటిమలు అవుతాయి. మొటిమలు కాకూడదంటే ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అధిక గ్లైసెమిక్ ఆహారాలు

గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) అనేది ఆహారాలలో కార్బోహైడ్రేట్లను నిర్ణయించే రేటింగ్ వ్యవస్థ. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన శరీరాలు యుక్త వయస్సులో ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్ (ఐజిఎఫ్ -1) అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తాయి. అడ్వాన్సెస్ ఇన్ డెర్మటాలజీ అండ్ అలెర్జాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు IGF-1 స్థాయిలను పెంచే అవకాశం ఉందని, ఇది మొటిమలకు దారితీస్తుందని కనుగొంది. చక్కెర ఉన్న ఆహారాలు, శీతల పానీయాలు, వైట్ బ్రెడ్, రొట్టె, బంగాళదుంపలు, తెల్ల బియ్యం మొదలైన ఆహారాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. 

పాల ఉత్పత్తులు

మొటిమలు అయ్యే వారు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని అడ్వాన్సెస్ ఇన్ డెర్మటాలజీ అండ్ అలెర్గాలజీ అధ్యయనం కనుగొంది. ఎందుకంటే పాల ఉత్పత్తులు మొటిమలను కలిగిస్తాయి. ది జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఈస్తటిక్ డెర్మటాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో.. పాడి మొటిమలను చికాకుపెడుతుందని కనుగొన్నారు. పాల ఉత్పత్తులను తినడం వల్ల హార్మోన్లు అసమతుల్యంగా మారతాయి. ఇది మొటిమలను ప్రేరేపిస్తుంది. అందుకే మీ పెళ్లి రోజుకు ముందు వీటికి దూరంగా ఉండటం మంచిది.

ప్రోటీన్ పౌడర్లు

ఇవి మీ కండరాలకు గొప్పవే.. అయినప్పటికీ ఇవి మీ చర్మానికి అంత మంచివి కాకపోవచ్చు. ఎందుకంటే ఇవి కూడా మొటిమలను కలిగించే అవకాశం ఉందని అనేక క్లినికల్ అధ్యయనాలు కనుగొన్నాయి. 

దాల్చినచెక్క

దాల్చిన చెక్కతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే దీన్ని తరచుగా ఉపయోగిస్తుంటారు. కానీ దీన్ని మీ వివాహానికి ముందు అసలే తినకండి. ఎందుకంటే దాల్చిన చెక్క మొటిమలను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

హైడ్రేట్ గా ఉండండి

మొటిమలను నివారించడానికి నీళ్లు, కొబ్బరి నీళ్లను పుష్కలంగా తాగాలని నిపుణుడు సలహానిస్తున్నారు. నీళ్లను పుష్కలంగా తాగితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. నిర్జలీకరణం, పొడి చర్మం సమస్యలను నివారించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొడి చర్మం నూనె ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది.