పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. ఈ క్రమంలో చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారు వెనకపడిపోతుంటారు. మరి పిల్లలకు సరైన పోషకాలు, విటమిన్స్ అందాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా...
బాల్యంలో సరైన పోషకాహారం తీసుకుంటేనే.... అది పెద్దైన తర్వాత కూడా వారికి ఉపయోగపడుతుంది. చాలామంది తమ పిల్లలకు రోజూ ఒకేరకమైన ఆహారం పెడుతూ ఉంటారు. పిల్లలు కూడా అలాంటివాటికే అలవాటు పడిపోతుంటారు. కొత్తవి తినడానికి కూడా ప్రయత్నించరు. అదే జరిగితే... పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సరిగా ఉండదు. ఈ క్రమంలో చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ వారు వెనకపడిపోతుంటారు. మరి పిల్లలకు సరైన పోషకాలు, విటమిన్స్ అందాలంటే కొన్ని రకాల ఫుడ్స్ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా...
ఓట్స్.... వీటిని చాలా మంది పెద్దలు బరువు తగ్గే ఆహారంగా భావిస్తుంటారు. అయితే.. నిజానికి బరువు సంగతి పక్కన పెడితే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిని తీసుకుంటే పిల్లలు ఉత్సాహంగా తయారవుతారు. ఉదయం టిఫిన్ సమయంలోగానీ.. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గానీ పెడితే మంచింది. వీటిని తినడానికి పిల్లలు మారాం చేస్తే.. వారికి నచ్చే ఫ్రూట్స్, చర్రీస్ లాంటివి కలిపి తినిపించాలి.
చేపలు... పిల్లలకు వారానికి ఒకసారైనా చేపలు తినిపించాలి. వీటిల్లోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. కుంగుబాటు, ఒత్తిడి వంటి వాటిని దూరం చేస్తాయి. గర్భిణీలు వీటిని క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకుంటే... పుట్టే బిడ్డ ఆరోగ్యంగా, చలాకీగానూ, ఎక్కువ తెలివితేటలతోనూ పుట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కోడిగుడ్లు... ఆటల్లో చురుగ్గా ఉండే చిన్నారులకు సరైన ప్రోటీన్లు అందాలంటే... వారి ఆహారంలో గుడ్లు కచ్చితంగా భాగం కావాలి. గుడ్లలో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుంది. రోజుకో గుడ్డు తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.
మంచినీరు... మంచినీరు పిల్లలతో ఎక్కువగా తాగించాలి. ఎంత ఎక్కువ మంచినీరు తాగితే అంత మంచిది. అప్పుడప్పుడు నీటిలో నిమ్మరసం కలిపి తాగిస్తే.. వారికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది.
అరటిపండు.. పిల్లల్లో మేథోశక్తి పెరగాలంటే.. అరటి పండు చాలా అవసరం. దీనిలో ఉంటే పొటాషియం ఆరోగ్యానికి దోహదపడుతుంది. రోజుకి రెండు పండ్లు తినిపించినా నష్టం ఏమీ ఉండదు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 12, 2019, 4:39 PM IST