జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

పిల్లలకే కాదు పెద్దలకు కూడా  మంచి జ్ఞాపకశక్తి అవసరం. కానీ కొంతమంది ఇప్పుడు చెప్పిన విషయాలను అప్పుడే మర్చిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని పనులు చేస్తే మర్చిపోయాను అనే ముచ్చటే ఉండదు. 

best tips to boost memory power rsl

ప్రతి ఒక్కరూ విషయాలను మర్చిపోతుంటారు. కానీ చాలా రేర్ గా. కొంతమంది మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటారు. కానీ ఈ మతిమరుపు పెద్ద చిక్కులను తెచ్చిపెడుతుంది.  డబ్బులు ఎక్కడ పెట్టానో, బండి తాళాలు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదంటే ప్రతి ఒక్క విషయాన్ని మర్చిపోతుంటారు. ఈ మతిమరుపు కొన్ని కొన్ని సార్లు సమస్యాత్మకంగా మారుతుంది. ఇలాంటి వారికి ముఖ్యమైన విషయాలను చెప్పినా ప్రయోజనం ఉండదు. మెమోరీ పవర్ వీక్ గా ఉన్నవారు కొన్ని అలవాట్లను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవును ఈ అలవాట్లు మీ జ్ఞాపకశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. పని, వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకశక్తి చాలా ముఖ్యం. కాబట్టి మీ మెదడు ఆరోగ్యంగ జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే మెమోరీ పవర్ ను పెంచడానికి, బ్రెయిన్ ను  ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

తగినంత నిద్ర: మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి బెస్ట్ మార్గాల్లో తగినంత నిద్రపోవడం ఒకటి. అవును.. మీ జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి, సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి నిద్ర చాలా చాలా ముఖ్యం. అందుకే మీ మెమోరీ పవర్ బాగుండాలంటే మీరు ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల పాటు మంచి నాణ్యమైన నిద్రపోవాలి. నిద్రలేమి కూడా మీ అభిజ్ఞా పనితీరును, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు కంటినిండా నిద్రపోయేలా చూసుకోండి. 

ఆరోగ్యకరమైన ఆహారం : ఆరోగ్యకరమైన ఆహారం మనల్ని హెల్తీగా ఉంచడమే కాకుండా మన జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, విటమిన్ సి , విటమిన్ ఇ ఎక్కువగా ఉన్న ఆహారాలు జ్ఞాపకశక్తిని, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. మీ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి బ్లూబెర్రీలు, నట్స్, కొవ్వు చేపలు,ఆకుకూరలు వంటి ఆహారాలను మీ రోజువారి ఆహారంలో చేర్చండి. 

యాక్టివ్ గా ఉండండి: వ్యాయామం మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఇది మీ మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి కూడా మంచిదే తెలుసా? మీరు రెగ్యులర్ గా శారీరక శ్రమ చేయడం వల్ల  మీ జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మీ మెదడు ఆరోగ్యంగా కూడా ఉంటుదని పరిశోధనల్లో తేలింది. మీ జ్ఞాపకశక్తి పెరగాలంటే మీరు వారానికి మూడు లేదా నాలుగు రోజులు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. 

ఒత్తిడిని తగ్గించండి: దీర్ఘకాలిక ఒత్తిడి మన శారీరక ఆరోగ్యంపైనే కాదు మెదడు పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. స్ట్రెస్ లెవెల్స్ ను తగ్గించుకోవడానికి, జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ధ్యానం, లోతైన శ్వాస లేదా యోగా వంటి వ్యాయామాలను రెగ్యులర్ గా చేయండి. అలాగే మీ శరీరం, మనస్సు రెస్ట్ తీసుకోవడానికి సమయం కేటాయించండి. ఇది మీకు శారరీక, మానసిక ప్రయోజనాలను కలిగిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios