Asianet News TeluguAsianet News Telugu

Bathukamma 2023: బతుకమ్మ పండుగ గురించి ఎవరికీ తెలియని నిజాలు

Bathukamma 2023: బతుకమ్మ పండుగను ఎన్నో ఏండ్ల నుంచి జరుపుకుంటారు. ఈ పండుగ పుట్టుకకు ఎన్నో కారణాలు ఉన్నాయంటారు. ఈ పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతోంది కాబట్టి.. ఈ పండుగ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
 

Bathukamma 2023:  Amazing Facts About  Festival Of Bathukamma rsl
Author
First Published Oct 10, 2023, 2:57 PM IST | Last Updated Oct 10, 2023, 2:57 PM IST

Bathukamma 2023: బతుకమ్మను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఆడవారికి ఎంతో ప్రత్యేకమైంది. మీకు తెలుసా? ఈ బతుకమ్మను ఆ ప్రాంతంలో పెరిగే పువ్వులతోనే తయారుచేస్తాయి. ప్లాస్టిక్ పువ్వులను అస్సలు ఉపయోగించరు. బతుకమ్మ పండుగ సందర్బంగా బతుకమ్మ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రతి ఏడాది జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను వర్షాకాలం చివర్లో.. శీతాకాలం ప్రారంభానికి ముందు జరుపుకుంటారు. చారిత్రక విశ్వాసం ప్రకారం.. వర్షాకాలం వానల వల్ల తెలంగాణలోని మంచినీటి చెరువులలోకి నీరు పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ ప్రాంతాల్లోని వ్యవసాయరహిత, బంజరు మైదానాలంతటా వివిధ రకాల అడవి పువ్వులు పూస్తాయి. 

గునుగపూలు, తంగేడు పూలు, బంతిపూలు, చేమంతి పూలు, నంది వర్ధనం వంటి పూలపు ఈ పండుగలో విరివిగా వాడుతారు. 

ఆచారాల ప్రకారం.. ఆడపడుచులు అత్తవారింటి నుంచి పుట్టింటికి  పూలతో సంబరాలు చేసుకుంటారు. వారం రోజుల పాటు చిన్న చిన్న బతుకమ్మలను తయారు చేసి.. ప్రతిరోజూ సాయంత్రం వాటి చుట్టూ ఆడుతూ సమీపంలోని నీటి కొలను లేదా చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు.

పండుగను జరుపుకునే విధానం చాలా ప్రత్యేకమైనది. ఆడవారు తమ వాకిట్లో పేడతో కల్లాపిని జల్లి అందమైన ముగ్గులు, రంగులతో అంకరిస్తారు. 

బతుకమ్మను తయారు చేయడం ఒక జానపద కళ. మధ్యాహ్నం నుంచే మహిళలు బతుకమ్మను తయారుచేయడం ప్రారంభిస్తారు. పువ్వుల కాడలను చిన్నగా కట్ చేసి వరుసగా పేరుస్తారు. ఆ తర్వాత తాంబాలం అనే వెడల్పాటి ప్లేట్ లో బతుకమ్మను పేరుస్తారు. 

బతుకమ్మ అంటే 'తిరిగి జీవం పోసుకోండి తల్లి' అని అర్థం వస్తుంది. ఈ పండుగలో సతీదేవిని తిరిగి రమ్మని కోరుతారు. దేవీ సతీదేవి పార్వతి దేవిగా జీవం పోసుకుంటుందని, అందుకే ఈ పండుగను పార్వతీదేవికి కూడా అంకితం చేశారని నమ్ముతారు. అయితే ఈ పండుగ వెనుక మరెన్నో కథలున్నాయి.

గౌరీదేవి 'మహిషాసురుడు' అనే రాక్షసుడిని యుద్ధం తర్వాత సంహరించిందని కొందరు చెబుతుంటారు. ఆ తర్వాత అలసట కారణంగా 'ఆశ్వయుజ పాడ్యమి'లో నిద్రకు ఉపక్రమించిందట. భక్తులు ఆమెను మేల్కోవాలని ప్రార్థించగా.. దశమి నాడు ఆమె నిద్రలేచిందని నమ్ముతారు.

ఈ పండుగ గురించి మూడో కథ ఏమిటంటే..  చోళ రాజు  ధర్మాంగద, 'సత్యవతి' కుమార్తె బతుకమ్మ. రాజు, రాణి యుద్ధభూమిలో తమ 100 మంది కుమారులను కోల్పోయి.. తమ సంతానంగా తమ ఇంట్లో లక్ష్మీదేవి జన్మించాలని లక్ష్మీదేవిని ప్రార్థించారట. లక్ష్మీదేవి వారి ప్రార్థనలు విని వారిని కరుణించిందట. రాజభవనంలో లక్ష్మీదేవి జన్మించినప్పుడు ఋషులందరూ వచ్చి ఆమెను ఆశీర్వదించి "బతుకమ్మ లేదా శాశ్వతంగా జీవించండి" అని ఆశీర్వదించారని చెబుతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios