Asianet News TeluguAsianet News Telugu

శృంగారంలో పొల్గొనడానికి ముందు చూయింగ్ గమ్ తో పాటుగా, వీటిని కూడా తినకండి.. ఒకవేళ తిన్నారో?

శృంగారంతోనే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. అంతేకాదు ఇది ఇద్దరి మదిలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతుంది. అయితే సెక్స్ లో పాల్గొనడానికి ముందు నోరు రీఫ్రెష్ గా ఉండాలనో లేకపోతే మంచి వాసన రావాలనో చూయింగమ్ ను నములుతుంటారు. కానీ వీటిని నమలడం వల్ల సెక్స్ లో ఎక్కువ సేపు ఉండలేరు. అలాగే.. 
 

Avoid chewing gum and these foods before having sex
Author
First Published Feb 9, 2023, 1:18 PM IST

వైవాహిక జీవితంలో సెక్స్ లైఫ్ మెరుగ్గా ఉంటేనే మిగతా లైఫ్ అంతా ఆనందంగా, ఆహ్లాదంగా గడిచిపోతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒక సారి లేదా వారంలో మూడు నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. బరువు తగ్గుతారు. గుండె ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు దూరమవుతాయి. ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ తగ్గుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

అయితే చాలా మంది సెక్స్ కు ముందు రీఫ్రెష్ గా ఉండటం కోసం స్నానం చేస్తారు. ఇంకొందరు ఫర్ఫూమ్ కొట్టుకుంటారు. ఇంకొందరైతే నోరు రీఫ్రేష్ గా లేదా నోటి నుంచి ఎలాంటి దుర్వాసన రాకూడదని  చూయింగమ్ తో పాటుగా ఇంకొన్ని ఆహారాలను తింటుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు. 

సెక్స్ కు ముందు చూయింగ్ గమ్ ను నమలగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. అంతేకాదు  వీటిని నమలడం వల్ల మీ కడుపు మీరు ఫుడ్ ను తీసుకుంటున్నట్టుగా భావిస్తుంది. అలాగే ఆ ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగించే స్టమక్ ఎంజైమ్లను రిలీజ్ చేస్తుంది. ఇది కాస్త గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. 

పుదీనా

కొంతమంది నోట్లో మంచి వాసన రావాలని పుదీనా ఆకులను కూడా నములుతుంటారు. కానీ ఇది కూడా మంచిది కాందంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుదీనా టెస్టోస్టెరాన్ ను అణచివేస్తుంది. ఇది తక్కువ లిబిడోకు దారితీస్తుంది. దీనివల్ల మీరు సెక్స్ లో ఎక్కువ సేపు ఉండలేరు. ఆ ఆనందాన్ని కూడా పొందలేరు. 

ఆల్కహాల్

సెక్స్ కు ముందు ఆల్కహాల్ ను కూడా తాగకూడదు. కానీ చాలా మంది ఒకటి లేదా రెండు గ్లాసుల ఆల్కహాల్ ను తాగి సెక్స్ లో పాల్గొంటుంటారు. కానీ ఇది పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనలేరు. అంతేకాదు  ఇది ఇద్దరికీ ఒత్తిడి, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. 

రెడ్ మీట్

రెడ్ మీట్ ను తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థపై అదనపు పనిభారం పడుతుంది. ఎందుకంటే ఈ రెడ్ మీట్ అంత సులువుగా జీర్ణం కాదు. దీనిని తినడం వల్ల బద్దకం, అలసట వంటి సమస్యలు వస్తాయి. 

బ్రోకలీ

బ్రోకలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ సెక్స్ కు ముందు బ్రోకలీని తింటే మీరు పడకగదిలో ఆనందాన్ని పొందలేరంటున్నారు నిపుణులు. 

జున్ను

పాల ఉత్పత్తులు లిబిడోను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. నైట్ సెక్స్ లో పాల్గొనాలనుకంటే అప్పుడు జున్నును తీసుకోకపోవడమే మంచిది. ఈ జున్ను మీ కడుపును ఉబ్బిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios