Aromatherapy for Migraine Relief మైగ్రేన్ నొప్పా? ఈ అరోమాథెరపీతో గాయబ్!
మైగ్రేన్ చాలామందిలో ఒక భరించలేని సమస్య. అరోమాథెరపీతో ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు అనే విషయం మీకు తెలుసా? అరోమాథెరపీ అనేది సువాసనల ద్వారా మనసుకి, శరీరానికి ఉపశమనం కలిగించే ఒక కొత్త రకం చికిత్స.

సువాసనలు వెదజల్లితే తలనొప్పి తగ్గుతుంది, ఈ కొత్త పద్ధతిలో శరీరానికి, మనసుకి ఉత్తేజం కలుగుతుంది. మైగ్రేన్ మహమ్మారి బాధతో విలవిలలాడేలా చేయడమే కాదు.. రోగనిరోధక శక్తి బలహీనపరుస్తుంది. మనసు, తల రెండూ బరువుగా అనిపిస్తాయి. ఇప్పుడు వాసన, చర్మం యొక్క శోషణ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ఒక కొత్త చికిత్స వచ్చింది. దీన్ని అరోమాథెరపీ అంటారు. ఈ చికిత్సలో సువాసనలు వెదజల్లి మనసుకి, శరీరానికి ఉపశమనం కలిగిస్తారు. సువాసనలు వెదజల్లే యంత్రాలు లేదా ఇన్హేలర్ల ద్వారా ముక్కు ద్వారా ఆ సువాసనలు లోపలికి పంపిస్తారు. కొన్నిసార్లు స్నానపు నీటిలో ప్రత్యేక రకాల సువాసన నూనెలు కలుపుతారు.
అరోమాథెరపీ ఎలా చేయాలి?
1. గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. తల ఒత్తిడి తగ్గుతుంది, మనసు, తల తేలికగా అనిపిస్తుంది.
2. పడుకునే ముందు దిండు మీద లేదా రుమాలు మీద కొన్ని చుక్కల మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేసి దాని వాసన పీల్చండి. నిద్ర బాగా పడుతుంది. ఉదయం ఉత్సాహంగా ఉంటుంది.
3. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి నుదుటి మీద మసాజ్ చేయండి, ప్రశాంతంగా అనిపిస్తుంది.
4. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత లేదా సాయంత్రం వేళల్లో అరోమా స్టిక్స్ లేదా అరోమా డిఫ్యూజర్ వాడండి, రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
అరోమాథెరపీ ఎలా పనిచేస్తుంది?
మైగ్రేన్ లేదా మానసిక ఒత్తిడి వల్లే కాదు, ఋతుచక్ర సమయంలో, వాతావరణ మార్పుల వల్ల కూడా తల బరువుగా అనిపిస్తుంది. ఒక కొరియన్ పరిశోధనలో ఎసెన్షియల్ ఆయిల్స్ నాడుల ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. పెప్పర్‌మింట్ ఆయిల్ లో ఉండే మెంథాల్ శరీరానికి చల్లదనాన్ని కలిగించి, ఉద్రిక్తతను, శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జలుబు లేదా దగ్గు వల్ల తలనొప్పి వస్తే యూకలిప్టస్ ఆయిల్ ఉపశమనం కలిగిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ మూసుకుపోయిన ముక్కును కూడా తెరుస్తుంది.