ప్రసవం తర్వాత సులభంగా బరువు తగ్గాలంటే...
గర్భం దాల్చిన సమయంలో చాలా మంది స్త్రీలకు పొట్ట, నడుము దగ్గర చుట్టూ కొవ్వు చేరుతుంది. ఎక్కువ గంటలపాటు కూర్చోవడం, అతిగా ఆహారం తినడం లాంటివి కారణాలు కావొచ్చు. అయితే... ఇలా ప్రయత్నిస్తే మాత్రం సులభంగా బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు.
కడుపుతో ఉన్నప్పుడు... ఎక్కువ ఆహారం తీసుకున్నా.. తీసుకోకపోయినా చాలా మంది బరువు పెరుగుతుంటారు. కొందరు డెలివరీ తర్వాత ఆ పెరిగిన బరువు సులభం తగ్గిపోతారు. కొందరికి మాత్రం ఎంత ప్రయత్నించినా ఆ బరువు మాత్రం తగ్గదు. ఎంత తిండి మానేసినా.. శరీరాకృతిలో మార్పు రాదు. మరీ ముఖ్యంగా కొందరికీ పిరుదులు, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ సమస్యను అదుపు చేయాలంటే.. కొన్ని రకాల చిట్కాలు ప్రయత్నిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
గర్భం దాల్చిన సమయంలో చాలా మంది స్త్రీలకు పొట్ట, నడుము దగ్గర చుట్టూ కొవ్వు చేరుతుంది. ఎక్కువ గంటలపాటు కూర్చోవడం, అతిగా ఆహారం తినడం లాంటివి కారణాలు కావొచ్చు. అయితే... ఇలా ప్రయత్నిస్తే మాత్రం సులభంగా బరువు తగ్గవచ్చంటున్నారు నిపుణులు.
అప్ డౌన్ స్టెప్... ఇది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. ముందు ఒక చిన్న బల్లను తీసుకోవాలి. దానిపై కనీసం ముప్పైసార్లు ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నడుము భాగంలో కొవ్వు తగ్గుతుంది.
స్వ్కాట్స్.. దీని కారణంగా మంచి శరీరాకృతి సొంతమౌతుంది. ముందుగా నిటారుగా నిల్చోవాలి. కాళ్ల మధ్య అడుగు- అడుగున్నర దూరం ఉండేలా చూసుకోవాలి. చేతులను ముందుకు చాచి గాల్లో కూర్చుంటున్నట్లుగా కిందకు కూర్చునే ప్రయత్నం చేస్తూ పైకి లేవాలి. ఇలా కనీసం అరవైసార్లు చేసేందుకు ప్రయత్నించాలి.
వీటితోపాటు..రోజూ కొన్ని గంటలపాటు సైకిల్ తొక్కాలి. అంతేకాకుండా నడవడం, ఈత కొట్టడం లాంటివి చేస్తే కూడా బరువు సులభంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం రేపటి నుంచే వీటిని ప్రయత్నించి చూడండి.