Long Lasting Makeup: మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!
పెళ్లీలు, ఫంక్షన్లు, పండగలు సందర్భం ఏదైనా సరే ఆడవాళ్లు కచ్చితంగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. మేకప్ తో వారి అందం రెట్టింపు అవుతుంది. కొన్నిసార్లు మస్తు కష్టపడి వేసుకన్న మేకప్ కూడా కొద్దిసేపటికే పోతుంది. అయితే కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు మీ మేకప్ ను ఎక్కువసేపు ఉంచుకోవచ్చు.

నలుగురిలో తాము అందంగా, ప్రత్యేకంగా కనపడాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు. అందుకు తగ్గట్టుగా మేకప్, డ్రెస్సింగ్ అన్ని ఫాలో అవుతారు. అయితే కొన్నిసార్లు మేకప్ వారిని ఇబ్బంది పెడుతుంది. చాలాసేపు కష్టపడి వేసుకున్న మేకప్ కూడా ఒక్కోసారి కొద్దిసేపటికే పోతుంది. దాంతో వారు అప్ సెట్ అవుతుంటారు.
ప్రస్తుతం మేకప్ చాలా కామన్ అయిపోయింది. ఆఫీస్ కి వెళ్లినా, పార్టీకి వెళ్లినా ఎక్కడికి వెళ్లినా సరే.. లైట్ గా అయినా మేకప్ చేసుకుంటున్నారు. మేకప్ కరెక్ట్ గా ఉంటేనే మొహం మంచిగా ఉంటుంది. మేకప్ సరిగ్గా లేకపోతే ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. మేకప్ సరిగ్గా ఎంచుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మీ అందాన్ని మరింత పెంచడంతోపాటు, ముఖానికి సరిపోయే మేకప్ ఎంచుకోవాలి. అందులోనూ మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే కచ్చితంగా ఈ చిట్కాలు పాటించాలి.
ప్రైమర్ వాడండి
మనం వేసుకునే మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ముందుగా ప్రైమర్ వాడండి. ఇది మేకప్ బేస్ ను సున్నితంగా చేసి, మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది.
వాటర్ ప్రూఫ్ మేకప్
నార్మల్ మేకప్ తో పోలిస్తే.. వాటర్ ప్రూఫ్ మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. కాజల్, మస్కారా, లిప్ స్టిక్ లాంటివి వాటర్ ప్రూఫ్ వాడితే త్వరగా చెరిగిపోవు. అందంగా కనబడతారు.
సెట్టింగ్ పౌడర్ వాడండి
మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే సెట్టింగ్ పౌడర్ వాడండి. ఇది మేకప్ ను సెట్ చేసి, ముఖానికి ఫ్రెష్ లుక్ ఇస్తుంది. మొత్తం మేకప్ లుక్ ను అందంగా చూపిస్తుంది.
సెట్టింగ్ స్ప్రే వాడండి
మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే సెట్టింగ్ స్ప్రే వాడండి. మేకప్ వేసుకున్న తర్వాత ముఖంపై స్ప్రే చేయండి. ఇది మేకప్ ను బాగా సెట్ చేసి, అందంగా కనబడేలా చేస్తుంది.
ఎక్కువ లేయర్స్ వేయకండి
మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ఎక్కువ లేయర్స్ వేయకండి. తక్కువ మేకప్ వేసుకుంటే నో మేకప్ లుక్ వస్తుంది. ఇది ఎక్కువసేపు ఉంటుంది. నాచురల్ గా కనిపిస్తుంది.
సందర్భాన్ని బట్టి మనం మేకప్ వేసుకోవడం సహజమే. అయితే దాన్ని తీసేయడం కూడా చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేసి నిద్రపోవడం మంచిది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.