టూత్ పేస్టు ఇప్పటి వరకు మీరు కేవలం దంతాలను మాత్రమే శుభ్రం చేసుకొని ఉంటారు. కానీ..టూత్ పేస్టుతో మరెన్నో లాభాలు ఉన్నాయి. చర్మ సౌందర్యం దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్లను శుభ్రం చేసుకునే వరకు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. 

ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలను తొలగించడానికి టూత్ పేస్టు ఉపయోగపడుతుందట. రాత్రిపూట ముడతలు ఉన్న ప్రదేశంలో కొద్దిగా టూత్ పేస్టు రాసి.. అలాగే వదిలేయాలి. ఉదయాన్నేనీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముడతలు తగ్గిపోతాయి.

ముఖం పై మొటిమలు తగ్గించేందుకు కూడా టైత్ పేస్టు బాగా ఉపయోగపడుతుంది. రాత్రిపూట మొటిమలపై పేస్టు రాసి.. ఉదయాన్ని కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.

స్మార్ట్ ఫోన్ తెరలను శుభ్రం చేసేందుకు టూత్ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా టూత్ పేస్ట్ ను తీసుకొని ఫోన్ స్క్రీన్ పై రాయాలి. అనంతరం శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే ఫోన్ స్క్రీన్ మెరుస్తుంది. స్క్రాచ్ లు ఉన్నా ఉన్నా అంతగా కనిపించవు.

దుస్తులపై పడిన కొన్ని రకాల మరకులను, వెండి వస్తువులను, అద్దాలను తుడవడానికి, కాలిన గాయాలకు టూత్ పేస్టు బాగా పనిచేస్తుంది.