ఇండియాలో 300,000 కు పైగా మసీదులు ఉన్నాయి. వాటిలో ఎన్నో శిథిలావస్తకు చేరుకుంటే.. మరికొన్ని కనుమరుగై పోయాయి. ప్రస్తుతం భారత దేశంలో లక్షకు పైగా మసీదులు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద మసీదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

1. జామా మసీదు - న్యూఢిల్లీ

భారతదేశంలోని జామా మసీదు.. ప్రపంచంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన మసీదులలో ఒకటి. దీనిని 1956లో షాజహాన్ నిర్మించారు. ఈ భవనం 25,000 మందికి వసతి కల్పిస్తుంది. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో తయారు చేసిన ఈ మినార్ 135 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మసీదుగా పేరు సంపాదించుకుంది. 

2. మక్కా మసీదు- హైదరాబాద్

భారతదేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఒకటైన మక్కా మసీదును 1694 లో నిర్మించారు. దీన్ని మక్కా నుంచి ఎగుమతి చేయబడిన మట్టి , ఇటుకలతో నిర్మించారు. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10,000 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉంది.

3. తాజ్-ఉల్-మసాజిద్ - భోపాల్

భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో తాజ్- ఉల్-మసాజిద్ ఒకటి. దీనిని "మసీదుల కిరీటం" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదులలో ఒకటిగా గుర్తింపు పొందింది.

4. జామియా మసీదు- శ్రీనగర్

జామియా మసీదు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి. ఇది శ్రీనగర్ లో ఉంది. ఈ మసీదులో ఒకేసారి 33,000 మందికి వసతి పొందొచ్చు. ఇది భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో మొదటి ఐదు స్థానాల్లో ఉంది.

5. బారా ఇమాంబరా- లక్నో

ఈ బారా ఇమాంబరా మసీదును 1784 లో అవధ్ నవాబు నిర్మించారు. ఈ మసీదులో ఒకే సమయంలో 300,000 మందికి పైగా ప్రజలు ప్రార్థనలు చేసుకోవచ్చు.

పురాణాల ప్రకారం.. ఈ మసీదు క్రింద ఉన్న సొరంగం గోమతి నదికి లేదా ఫైజాబాద్, అలహాబాద్, ఢిల్లీ వంటి ప్రదేశాలకు కూడా దారితీస్తుంది. కానీ వాటి నుంచి వెళ్లడానికి అనుమతి లేదు.

6. చోటా ఇమాంబర- లక్నో

బారా ఇమాంబరా సమీపంలోనే చోటా ఇమాంబరా ఉంది. దీనిని 1838 లో నిర్మించారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో కూడా ఒకటి. అవధ్ మూడవ నవాబు అతని తల్లి జ్ఞాపకార్థం, ఖననం చేయడానికి ఈ మసీదు నిర్మించాడు. 

7. జామా మసీదు - భిలాయ్

భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో జామా మసీదు ఒకటి. చత్తీస్ గఢ్ లోని భిలాయ్, అరబిక్ లిపిలో "యా అల్లాహ్" ఆకారంలో నిర్మించిన ప్రపంచంలోని మొట్టమొదటి మసీదు ఇది.

8. నగీనా మసీదు- ఆగ్రా

ఈ మసీదును "జెమ్ మసీదు" అని కూడా పిలుస్తారు. షాజహాన్ నిర్మించిన ఆగ్రా కోటలో మూడు గోపురాలు, గంభీరమైన తోరణాలతో రాజకుటుంబాలకు చెందిన మహిళల కోసం నిర్మించారు.

9. జామా మసీదు - ఆగ్రా

జామీ మసీదుగా ప్రసిద్ధి చెందిన దీనిని షాజహాన్ తన కుమార్తె జహనారా బేగం కోసం నిర్మించారు. భారతదేశంలోని అతి పెద్ద మసీదులలో ఒకటైన ఈ మసీదులో ఒకే సమయంలో 10,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. 

10. హాజీ అలీ దర్గా - ముంబై

ముంబైలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మసీదు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మసీదులలో ఒకటి. ఈ మసీదు ఒక ద్వీపంలో నిర్మించబడింది. ఇది ముంబైలోని వర్లీ తీరానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది.