కరీంనగర్ జిల్లాలో కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో భార్యాభర్తలు మరణించారు. వివరాల్లోకి వెళితే.. సుల్తానాబాద్ నుంచి శ్రీనివాస్ తన భార్య స్వప్న, ఇద్దరు కొడుకులతో కలిసి హోండా సిటీ కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు.

Also Read:కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ రేపే: కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కెనాల్ వద్ద చేపలు కొనేందుకు కారును పక్కకు ఆపారు. కుమారులిద్దరు చేపలు కొంటుండగా శ్రీనివాస్ తన కారును రివర్స్ చేసే క్రమంలో అదుపుతప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లింది.

కాపాడండి కాపాడండి అంటూ వారిద్దరూ ఆర్తనాదాలు చేశారు. స్థానికులు స్పందించేలోపు కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో శ్రీనివాస్, స్వప్న ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also Read:విపక్షాలను చిత్తు చేసిన టీఆర్ఎస్‌: బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఇదీ...

గజ ఈతగాళ్ల సాయంతో ఎట్టకేలకు కారును బయటకు తీశారు. తమ కళ్లేదుటే ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రులను చూసి కుమారులిద్దరూ బోరున విలపించారు. వీరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.