రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు కరీంనగర్ నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. 58 డివిజన్లకు సంబంధించి సోమవారం ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Also Read:జూపల్లికి టీఆర్ఎస్‌ ఝలక్: కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ..

మొత్తం 3 రౌండ్ల లో ఓట్ల లెక్కిపు జరుగుతుండగా.. ఇందుకు సంబంధించి 58 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 58 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఒకరికి ఇద్దరు అసిస్టెంట్లు, 20 మంది మైక్రో అబ్జర్వర్లను అధికారులు నియమించారు.  

కౌంటింగ్ ప్రక్రియలో మొదటగా డివిజన్ ల వారిగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి అనంతరం ఓట్లు లెక్కిస్తారు. డివిజన్ల వారీగా 25 ఓట్లను ఒక కట్టకట్టి.. రౌండుకి వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. కాగా.. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జల్లాలోని అన్ని మున్సిపాలిటీలను అధికార టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది.

Also Read:విపక్షాలను చిత్తు చేసిన టీఆర్ఎస్‌: బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఇదీ...

ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కొత్తపల్లి, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి, జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్టుపల్లి, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, సిరిసిల్ల, వేములవాడలను కారు తన ఖాతాలో వేసుకుంది.