మున్సిపల్ ఎన్నికపై కసరత్తు ... కొత్త పద్దతిలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక : మంత్రి గంగుల
పార్లమెంట్ ఫలితాన్ని దృష్టిలో వుంచుకుని కరీంనగర్ మున్నిపల్ కార్పోరేషన్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ప్రత్యేేక వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ఈ వ్యూహాలన్నింటిని మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా అమలు చేస్తున్నారు.
కరీంనగర్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మొదట ఇక్కడి నుండే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు మిగతా మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని... వాటి గురించి ప్రజలకు వివరించాలన్నారు. సీఎం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోవడం వలనే గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజాదరణ కలిగిన నాయకున్ని కోల్పోయామని వినోద్ కుమార్ ఓటమిని గుర్తుచేశారు.
అయితే ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జెడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ చెక్కుచెదరని స్థానం సంపాదించుకుందని.. ఈసారి కరీంనగర్ జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు అన్నీ మున్సిపాలిటీలను సాధించకోవడం ఖాయమన్నారు.
read more కరీంనగర్ మున్సిపాలిటీయే లక్ష్యం... దూకుడుపెంచిన మంత్రి గంగుల
టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వుంటుందని... పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో సీనియారిటీ, క్రమశిక్షణగల కార్యకర్తలకు స్థానం కల్పిస్తున్నామని అన్నారు.
కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడానికి మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. కానీ ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అభివృద్ధికి ఎటువంటి నిధులు తేలేకపోయాడని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. ఆ పార్టీ ఎంపీ కరీంనగర్ అభివృద్ధి అడ్డుకోవాడానికి 15 లెటర్ ప్యాడ్ లు వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఎప్పుడుచూసినా గ్రానైట్ అక్రమ వ్యాపారం అంటూ పసలేని ఆరోపణలు చేస్తారని... తన రాజకీయ లబ్దికోసం ఆర్టీసీ కార్మికులు రెచ్చగొట్టారని ఆరోపించారు.
read more మున్సిపల్ ఎన్నికలే టార్గెట్... టీఆర్ఎస్ నేతల ఇళ్లలోనే ఆ యంత్రాంగం: ఈసికి బిజెపి ఫిర్యాదు
కరీంనగర్ అన్నీరంగాల్లో ముందుకు వెళ్లాలంటే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. 60 స్థానాలు గెలుచుకునేందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని... పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ప్రచారాస్త్రాలుగా శుక్రవారం నుండి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
నాలుగు గోడల మధ్య టిక్కెట్లు ప్రకటించడం ఇకపై జరుగదని... అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేశామన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థకు 6 మెన్ కమిటీ, కొత్తపల్లికి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 6 మెన్ కమిటీ సభ్యులుగా నారదాసు లక్ష్మణ్ రావు , కోడూరి సత్యనారాయణ గౌడ్ , ఆరేపల్లి మోహన్ , సంతోష్ కుమార్ ,ఎడవేల్లి విజేందర్రెడ్డి , సయ్యద్ అంజద్ అలీ ,కొత్తపల్లి 3 మెన్ కమిటీ సభ్యులుగా మెతుకు సత్యం , జివి రామకృష్ణరావు ,కొత్త శ్రీనివాస్ రెడ్డిలను కో ఆర్డినేటర్ గా నందేల్లి మహిపాల్ ను నియమించినట్లు తెలిపారు.