సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ  పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దర్శనానికి కోసం వెళుతున్న సీఎం కేసీఆర్ మార్గమధ్యలో కాళేశ్వరం జలాలను చూసి పరవశానికి లోనయ్యారు. దేవాలయానికి సతీసమేతంగా రోడ్డు మార్గంలో వెళుతున్న సమయంలో మానేరు నదిపై గల సిరిసిల్ల- తంగళ్లపల్లి వంతెనపై సీఎం కాన్వాయ్ ని ఆపి కాస్సేపు కాళేశ్వరం జలాలను పరిశీలించారు.  అనంతరం సీఎం దంపతులు ఆ నీటికి పూజలు చేసి జలహారతి ఇచ్చారు.  

అనంతరం నేరుగా వేములవాడ ఆలయానికి చేరుకుని రాజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. 

read more  తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?: రేసులో వీరే...

కేసీఆర్‌ కుటుంబ సమేతంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీఆర్‌ వెంట ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌ కూడా ఉన్నారు. స్థానిక మంత్రి ఈటల రాజేందర్‌ తో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఉన్నారు.

ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకే రవిశంకర్‌, సంజయ్‌ కుమార్‌, రసమయి బాలకిషన్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డితో పాటు పలువురు స్వాగతం పలికారు. 

read more  వేములవాడలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

టెంపుల్‌కు వచ్చే కంటే ముందు సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం పథకంతో ఎత్తిపోసిన గోదావరి జలాలతో నిండుకుండలా మారిన శ్రీరాజరాజేశ్వర(మధ్య మానేరు) జలాశయాన్ని పరిశీలించారు. మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు సీఎం కేసీఆర్‌ పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు.