కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతకొంతకాలంగా అలజడికి కారణమైన కరుడుగట్టిన దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి దొంగిలించిన బంగారంతో పాటు వివిధ వస్తువులను  స్వాధీనం చేసుకున్నారు. 

శుక్రవారం మంచిర్యాల  రైల్వే స్టేషన్ బయట సోదాలు నిర్వహిస్తున్న స్థానిక పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానస్థితిలో కనిపించారు. దీంతో వారిని పట్టుకుని  సోదా చేయగా ప్యాంటు జేబులో బంగారు ఆభరణాలు కనిపించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తమదైన  స్టైల్లో విచారించిన పోలీసులు వారి నేరాల చిట్టాను బయటకు లాగారు. 

విచారణలో భాగంగా పట్టుబడిన దొంగలిద్దరు తెలియజేసిన విషయాలను మంచిర్యాల డిసిపి డి.ఉదయ కుమార్ మీడియాకు వివరించారు. నిందితుల పేర్లు చందు హీరా బత్కల్, ప్రభు నగేష్ అని తెలిపారు. గతంలో హీరా బత్కల్ పలు దొంగతనలు చేయగా కరీంనగర్ ,మహారాష్ట్ర లోని  చంద్రాపుర్ మరియు ఇంగన్ ఘాట్ పోలీసు వారు అరెస్టు చేసినట్లు తెలిపారు.

read more  హాజీపూర్ కేసు: జడ్జి ప్రశ్నలకు నోరు మెదపని శ్రీనివాస్ రెడ్డి

అలాగే అతను జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత ప్రవర్తన మార్చకుండా తన బావమరిది ప్రభుతో పాటు తన స్నేహితులయిన సుబాష్ మరియుసునిల్ తో  కలిసి  ఓ గ్యాంగ్ ను  ఏర్పాటుచేశాడు. వీరు మంచిర్యాల , ఆసిఫాబాద్ జిల్లాల లోని పలు పోలీసు స్టేషన్ ల పరిది లో దాదాపు  17 ఇండ్లలో దొంగతనాలు చేసినట్లు... ఈ విషయాన్ని పట్టుబడిన నిందుతులే ఒప్పుకున్నట్లు డిసిపి తెలిపారు. 

దోపిడి చేసే విదానం(డిసిపి మాటల్లో)         

''వీరు మంచిర్యాల , బెల్లంపల్లి పట్టణాలు మరియు చుట్టుప్రక్కల మండలాలలోకి రైళ్ల లో వస్తారు.  సాయంత్రము చీకటి పడే సమయంలో లేదా రాత్రి సెకండ్ షో సినిమా తర్వాత ఎంచుకున్న ప్రాంతంలో తిరిగుతూ గేటు మరియు ఇంటికి తాళం వేసి ఉన్న ఇల్లను గుర్తిస్తారు. సాయంత్రం లేదా మధ్య రాత్రి సమయంలో కాని తెల్లవారు జామున కాని ఇనుప రాడ్డుతో తాళ్లాన్ని పగులగొట్టి ఇంట్లోని సొత్తును తీసుకొని తిరిగి రైల్లో మహారాష్ట్ర కు వెళ్ళిపోతారు. ఈ సొత్తును వెంకట్ భీమా డండేకర్, అమన్ ఖురాడే, సూరజ్, పుండలిక్ ల సాయంతో అమ్మి వారివద్ద నుండి డబ్బులు తీసుకునేవారు.'' అని డిసిపి తెలిపారు. 

read  more సమత కేసు: 'ఊహాజనిత ఆధారాలతో చార్ఝీషీట్ దాఖలు'

పోలీసులు సీజ్ చేసిన ప్రాపర్టీ వివరములు

ఈ దోపిడీ ముఠా 667.5 గ్రాముల బంగారు ఆభరణాలు ,160.5 తులాల వెండి ఆభరణాలు మరియు రూ: 4,76,760 లను దొంగలించగా కేవలం 474 గ్రాముల విలువగల బంగారు ఆభరణాలను  మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు  తెలిపారు.