కరీంనగర్ లో  దారుణం చోటుచేసుకుంది. స్థానిక సహస్ర జూనియర్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సొంత ఇంట్లో హత్యకు గురయ్యింది. గతకొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ  దారుణానికి కూడా అతడే కారణమన్న అనుమానాన్ని  స్థానికులు  వ్యక్తం చేస్తున్నారు.  ప్రేమను నిరాకరించిందన్న కోపంతో  కత్తితో యువతి గొంతుకోసి  వుంటాడని అనుమానిస్తున్నారు.   

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పదహారేళ్ళ బాలికను ఆమె సొంతింట్లోనే గొంతుకోసి హత్య చేశాడు ఓ ఉన్మాది. ఈ ఘటన నగరంలోని  విద్యానగర్ లో చోటుచేసుకుంది. 

ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురయినట్లుగా అనుమానిస్తున్న యువతిని రాధిక గా గుర్తించారు. ఆమె నగరంలోని సహస్ర జూనియర్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంది. యువతి తల్లిదండ్రులు ముత్త ఓదెమ్మ- కొమురయ్యలు కూలీపని చేసి జీవనం సాగిస్తున్నారు. 

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ బయటకు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి కూతురు రక్తం మడుగులో పడి విగత జీవిగా కనిపించింది.దీంతో స్థానికుల సహాయంలో వారు పోలీసులకు సమాచారం అందించారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

read more మరో మూడు రోజుల్లో పెళ్లి... యువతి ఆత్మహత్య

రాధిక మర్డర్ విషయంలో పలు విషయాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రాధికను వేరే వర్గానికి చెందిన ఓ అబ్బాయి ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదును చూసుకుని దాడికి పాల్పడినట్లు తెలస్తోంది. 

అయితే తల్లిదండ్రులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. కొంతకాలం క్రితం తమ ఇంట్లో ఓ తాగుబోతు కుటుంబంతో కలిసి అద్దెకు వుండేవాడని...అతడి నిత్యం తాగివచ్చి ఇంటివద్ద గొడవ చేస్తుండటంతో ఖాళీ చేయించామని  తెలిపారు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని వారేమైన ఈ ఘాతుకానికి పాల్పడ్డారేమోనని  తల్లి ఓదెమ్మ అనుమానం వ్యక్తం చేస్తుంది.

read more  నమ్మించి తీసికెళ్లి ఐదుగురు మిత్రులతో కలిసి యువతిపై గ్యాంగ్ రేప్

పోలీసులు ఈ ఘటనపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం.... డాగ్ స్క్వాడ్ చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. బాలిక మృతికి గల కారణాలను తెలుసుకునే పనిలోపడ్డారు కరీంనగర్ పోలీసులు.