జమ్మికుంటలో భారీచోరీ... నిందితుల యాక్షన్ కు పోలీసుల కౌంటర్ రియాక్షన్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇంటిదొంగల  గుట్టు రట్టు  చేశారు.  

jammikunta police arrested two accised in jewellery robbery case

కరీంనగర్: తమ జువెల్లరీ షాప్ లో దొంగతనం జరిగిందంటూ నాటకమాడిన యజమానులను జమ్మికుంట పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా పరిష్కరించి కేసు పెట్టినవారే నిందితులుగా గుర్తించారు. నేరం జరిగినట్లు నిందితుల హైడ్రామాకు తెరతీస్తే పోలీసుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఈ నాటకానికి స్వస్తి పలికారు. ఇలా కేవలం 24 గంటల్లోనే ఈ దొంగతనానికి సంబంధించిన అసలు గుట్టు విప్పారు జమ్మికుంట పోలీసులు. 

ఈ చోరీ నాటకానికి సంబంధించిన వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి మీడియాకు వివరించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన కాసుల మహేష్ మరియు కాసుల భాస్కర్ లు అన్నదమ్ములు. పట్టణంలోని గాంధీ చౌక్ లో  శ్రీవిజయ లక్ష్మి ట్రేడర్స్ ఆండ్ జ్యూవెల్లర్స్ లో పేరుతో  బంగారు నగల దుకాణం నడుపుతున్నారు. అయితే 2019 డిసెంబర్ 31 రోజున తమ జువెల్లరీ షాప్ లోచోరీ జరిగినట్లు చిత్రీకరించి భారీగా సొత్తు దొంగలపాలయినట్లు  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.. 

ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని 24 గంటల్లోనే వీరు ఇద్దరే కలిసి బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టాలన్న దూరాశతో దొంగతనం నాటకం ఆడినట్లు నిర్దారించారు. నిందితులిద్దరు వ్యాపారం నిమిత్తం వివిధ బ్యాంక్ లలో అధిక మొత్తంలో రుణాలు, ఎస్బిఐ బ్యాంక్ నందు ముద్రలోన్ కూడా భారీగా తీసుకొన్నట్లు తెలిపారు.  ఈ లోన్ డబ్బులతో బంగారం,వెండి కొనుగోలు చేసి,వ్యాపారం నిర్వహిస్తున్నారు. 

read more  కేటీఆర్ విలువైన రత్నం... మరి లోకేశ్...: మంత్రి ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్

అయితే బ్యాంక్ రుణాలను ఎలాగయినా ఎగ్గొట్టాలన్న దురాశ వీరికి కలిగింది. ఈ నేపథ్యంలోనే పక్కాగా మాస్టర్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం గత నెలలో బంగారం,వెండి కొనుగోలు చేశారు. షాప్ పేరుపై బిల్లులు  కూడా తీసుకున్నారు. ఇట్టి సొత్తును దొంగతనం జరిగినట్లు నమ్మించి తద్వారా బ్యాంక్ లోన్,ముద్ర లోన్ లపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మోసం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ ప్లాన్ లో భాగంగా డిసెంబర్ 31,2019 న వారి ఇంట్లో బీరువాలను పగలగొట్టి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించారు. సొత్తును మొత్తం వేరు వేరు ప్రదేశాల్లోకి మార్చారు. ముందుగా చేసుకున్న  ప్లాన్ ప్రకారం హైడ్రామా చేశారు. అయితే వీరి డ్రామాను అత్యంత చాకచచక్యంతో వ్యవహరించి గుర్తించిన పోలీసులు. ఈ  కేసును ఛేదించడంలో తెలివిగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అభినందించి తగు రివార్డులు అందజేశారు. 

read more  సిరిసిల్లలో రాడ్లు కత్తులు పట్టుకొని చెలరేగిన పోకిరీలు.. తాట తీసిన పోలీసులు.


  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios