వరంగల్: టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రత్నంలాంటి కేటీఆర్ పుడితే చంద్రబాబు కు మాత్రం లోకేశ్ లాంటి వ్యక్తి పుట్టాడని ఎద్దేవా చేశారు. లోకేశ్ మాట్లాడితేనే కాదు అతన్ని చూస్తేనే నవ్వు వస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

గతంలో స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత నాయకులు తెలంగాణ  గురించి అవమానకరంగా మాట్లాడారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే కనీసం కరెంట్ కూడా రాదని... పూర్తిగా రాష్ట్రం మొత్తం ఎడారిగా మారుతుందని అన్నారని గుర్తుచేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత అయిదేళ్లుగా సీఎం కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారో ఇప్పుడు అందరి కళ్ల ముందే ఉందన్నారు.

read more  నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం: కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా రాకున్నా ఆ మహాత్ముడు కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. గతంలో అభివృద్ధికి మారుపేరు గంగిదేవిపల్లి పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళం..కాని ఇప్పుడు మండలానికి అలాంటి పది గ్రామాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయన్నారు. 

గ్రామాల్లో మహిళలు ,యువకులతో కమిటీలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరు అభివృద్ధికి ముందుకు రావాలని... ఆర్థికంగానూ, శ్రమదానంలోనూ ముందుకు రావాలని మంత్రి ఎర్రబెట్టి సూచించారు. 

read more  సీఎంగా కేటీఆర్... ముహూర్తం ఎప్పుడు?

గతంలో కూడా ఎర్రబెల్లి సీఎం తనయుడు కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ తర్వాత సీఎం పదవిని అధిరోహించడానికి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని... అందుకు ఆయనే సమర్థుడని అభిప్రాయపడ్డారు. అయితే కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతారన్న దానిపై కేసీఆర్ దే తుది నిర్ణయమని పేర్కొన్నారు.