కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపూర్‌లో బీటెక్ విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. సిరిసిల్ల జిల్లా మర్థన్‌పేటకు చెందిన అనూష అనే విద్యార్ధిని తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది.

ఈ క్రమంలో శుక్రవారం నగరంలోని వాసుదేవ గర్ల్స్ హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని విద్యార్ధినులు హాస్టల్ యజమాన్యానికి తెలియజేడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అనూష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూష ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:

కామాంధుడు: మామ లైంగిక వైధింపులతో కోడలు ఆత్మహత్య

భార్యా పిల్లలను చంపి రోజంతా అక్కడే, ఆతర్వాతే టెక్కీ ప్రదీప్ సూసైడ్