Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ టీఎస్‌పీఎస్‌సి 2021 ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లయి చేసుకోవడానికి క్లిక్ చేయండి..

టీఎస్‌పీఎస్‌సి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులు పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలలో ఉన్నాయి. 

tspsc recruitment 2021 released for 127 junior assistant cum typist senior assistant posts apply at tspsc gov in
Author
Hyderabad, First Published May 14, 2021, 4:02 PM IST

 తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సి ) ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా  మొత్తం 127 సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులు పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలలో ఉన్నాయి.  

పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్‌ అసిస్టెంట్‌, 10 జూనియర్‌ అసిస్టెంట్‌-టైపిస్టు పోస్టులు ఉన్నాయి. అలాగే ‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో 102 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నయి. మరింత సమాచారం కోసం https://www.tspsc.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో  చూడవచ్చు.

 విద్యార్హతలు: డిగ్రీతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత/ బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణత/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుతో డిగ్రీతో పాటు టైప్‌ రైటింగ్‌ ఇంగ్లిష్‌ (లోయర్‌ గ్రేడ్‌)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్‌ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

also read సికింద్రాబాద్‌-సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. ...

పరీక్ష విధానం: ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (డిప్లొమా స్టాండర్డ్‌) 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్‌ పేపర్‌ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ.200/- , ఎస్‌సి/ఎస్‌టి అభ్యర్థులకు రూ.80/-

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12 ఏప్రిల్ 2021

దరఖాస్తుల చివరితేదీ: 20 మే 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://www.tspsc.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios