హైదరాబాద్‌  నగరంలోని ఆకాశవాణి (అల్ ఇండియా రేడియో) కేంద్రంలో టెంపరరీగా పనిచేసేందుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో తాత్కాలికంగా(టెంపరరీ) పనిచేసేందుకు  న్యూస్‌ ఎడిటర్లు, తెలుగు రిపోర్టర్,  తెలుగు మరియు ఉర్దూ న్యూస్‌రీడర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం పోస్టుల వారీగా విద్యార్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగినవారు ఆఫ్‌లైన్ విధానం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసించే వారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

మొత్తం ఖాళీల సంఖ్య: 03

న్యూస్ ఎడిటర్/రిపోర్టర్: 01

also read LICలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల

విభాగం: తెలుగు

ఉండాల్సిన అర్హత: ఏదైనా డిగ్రీ లేదా జర్నలిజంలో డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.

అనుభవం: ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వర్క్ విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

న్యూస్ రీడర్: 02

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత పొంది ఉండాలి. భాషపై పట్టు, మంచి వాయిస్ ఉండాలి.

విభాగం: తెలుగు, ఉర్దూ.

అనుభవం: టీవీ/రేడియోలో జర్నలిజం విభాగంలో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

also read రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు...ఐటీఐ అర్హత ఉంటే చాలు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. న్యూస్ రీడర్ పోస్టులకు ఆడిషన్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది.

దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 16.12.2019.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:

Deputy Director General [P],
All India Radio, Saifabad,
Hyderabad - 500 004.