సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే-SCR ) స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అర్హత‌: 50 శాతం మార్కులతో ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌ పొంది ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 08.12.2019 నాటికి 15-24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

also read civil service jobs: సివిల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదల

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఎస్సీ, ఎస్టీ, అలాగే దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.11.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రి తేది: 08.12.2019.