Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా ఎస్బీఐ లో ఉద్యోగం

ఎస్ బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే..
 

SBI SO recruitment 2020: Application process begins, selection without exam
Author
Hyderabad, First Published Jun 25, 2020, 7:17 AM IST

నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. ఎస్బీఐ లో ఉద్యోగం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నవారు  చాలా మందే ఉండి ఉంటారు. అలాంటివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సువర్ణావకాశం వచ్చింది. ఎస్ బీఐలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 431 ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులకు జూన్‌ 23, 2020 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 13, 2020 దరఖాస్తుకు చివరితేదీ. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://sbi.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 431
ఎగ్జిక్యూటీవ్ (FI & MM) - 241
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 85
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ రిలేషన్స్)- 2
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (అనలిటిక్స్)- 2
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ మార్కెటింగ్)- 2
హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)- 1
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & డేటా అనలిటిక్స్)- 1
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 1
ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 9
ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ)- 1
రిలేషన్‌షిప్ మేనేజర్ (బ్యాక్‌లాగ్)- 48
రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20
ప్రొడక్ట్ మేనేజర్- 6
మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2
మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1
ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్, కోల్‌కతా- 3
బ్యాకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్ట్- 1
మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1
వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1
చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3
డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3
డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1
డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8
చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1


 

Follow Us:
Download App:
  • android
  • ios