తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) 2021-22 విద్యా సంవత్సరానికి అప్రెంటిస్‌షిప్‌ ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. పదో తరగతి పాసై ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

also read ఐ‌బి‌పి‌ఎస్ నోటిఫికేషన్‌ విడుదల.. బీఈ/ బీటెక్ అర్హత ఉన్నవారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

ఎంపిక చేసిన అభ్యర్థులకు సికింద్రాబాద్‌ రీజినల్‌ పరిధిలోని 12 డిపోలలో శిక్షణ కల్పిస్తారు. మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేసి రీజినల్‌ పరిధిలోని 12 డిపోలలో అవసరం మేరకు అంప్రెంటిషిప్‌ శిక్షణ కల్పిస్తారు.

అర్హత: డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ట్రిషన్‌, మోటార్‌ మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: 30 జనవరి 2021

అధికారిక వెబ్‌సైట్‌:https://apprenticeshipindia.org/