Asianet News TeluguAsianet News Telugu

బీఈ/బీటెక్‌ చేసిన నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.42 వేల జీతం..

కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్ సివిల్ & ఎలక్ట్రికల్ పోస్టుల నియామకానికి దరఖాస్తులాను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15 లోగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

NBCC Recruitment 2020 released for 100 Engineer Posts, check detail here apply online
Author
Hyderabad, First Published Nov 13, 2020, 8:56 PM IST

 హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్, భారత ప్రభుత్వం ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజనీర్ సివిల్ & ఎలక్ట్రికల్ పోస్టుల నియామకానికి దరఖాస్తులాను ఆహ్వానిస్తుంది.

అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 15 లోగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈస్త్/బీటెక్‌ లో ఉత్తీర్ణత పొందిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను రాత‌పరీక్ష‌/గ్రూప్‌ డిస్క‌ష‌న్ & ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తారు. 

పూర్తి సమాచారం కోసం https://www.nbccindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 100
సివిల్‌- 80
ఎల‌క్ట్రికల్‌- 20

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

also read బీటెక్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ. ...

ఎంపిక విధానం: రాత‌పరీక్ష‌/గ్రూప్‌ డిస్క‌ష‌న్ & ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.550
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15 డిసెంబర్‌  2020.
చిరునామా: 
General Manager (HRM), 
NBCC (I) Limited, NBCC Bhawan, 
2nd Floor, Corporate Office, 
Near Lodhi Hotel, Lodhi Road, 
New Delhi-110003.
అధికారిక వెబ్‌సైట్‌:https://www.nbccindia.com/

Follow Us:
Download App:
  • android
  • ios